* శ్రీ సత్యసాయి: సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు.. నేడు పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని, పయ్యావుల కేశవ్, అనిత, సత్యకుమార్ .. వీఐపీల తాకిడితో పుట్టపర్తిలో భారీ భద్రత ఏర్పాటు
* తిరుమల: ఇవాళ టిటిడి పాలకమండలి సమావేశం.. వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు జారీ విధానంపై నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి.. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం.. మొదట మూడు రోజులకు సంబంధించి ఆన్ లైన్ లో టిక్కెట్లు జారీ చేసే యోచనలో టీటీడీ..
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వైభవంగా సాగుతున్న సత్యసాయి శతజయంతి వేడుకలు.. నేడు సత్యసాయి రథోత్సవం. వెండి రథంపై ఊరేగనున్న సత్యసాయి బాబా.. రథోత్సవ వేడుకలు లో పాల్గొనున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ప్రశాంతి నిలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేపట్టనున్న భక్తులు.. వేడుకలలో పాల్గొనేందుకు తరలివచ్చిన భక్తులు.
* తెలంగాణలో ఇకపై వాట్సాప్‌లోనే మీ-సేవ సర్టిఫికెట్లు.. మీసేవ వాట్సాప్ సేవను నేడు అందుబాటులోకి తీసుకురానున్న తెలంగాణ ప్రభుత్వం.. నేడు లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్‌బాబు
* హైదరాబాద్: అనర్హత పిటిషన్ల విచారణపై ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. నేడు తెల్లం వెంకట్రావ్.. సంజయ్ పిటిషన్‌లను విచారించనున్న స్పీకర్.. రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి.. అరికపూడి గాంధీల పిటిషన్ల విచారణ
* నల్లగొండ జిల్లా: నేడు కోదాడ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన..
* ఆదిలాబాద్: నేడు జిల్లాలో కేటీఆర్ పర్యటన.. జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డుకు కేటీఆర్.. రైతుల సమస్యలను పంట అమ్మకంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలుసుకో నున్న కేటీఆర్. ఆ తర్వాత సిసిఐ అధికారుల్ని కలవనున్న బీఆర్ఎస్ నేతల బృందం.
* అమరావతి: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలు నియోజకవర్గాల సమన్వయకర్తలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం..
* బాపట్ల: జే పంగులూరు మండలం ముప్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్..
* పట్టణాభివృద్ధిపై హైదరాబాద్ లో ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమావేశం.. హాజరుకానున్న కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కార్యదర్శి కటికితల శ్రీనివాస్.. ఏపీ నుంచి మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ హాజరు.. అమృత్-2 పథకం అమలు తీరు, స్వచ్ఛ భారత్ మిషన్-2, పేదల గృహ నిర్మాణం, పట్టణ పరి వాహన అంశాలపై ప్రధాన చర్చ… పట్టణాభివృద్ధి లో తీసుకోవాల్సిన చర్యలు.. మౌలిక సదుపాయాల అభివృద్ధి పై సమీక్ష…
* రేపు ఏపీ కి ప్రధాని నరేంద్ర మోడీ.. సత్యసాయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడీ.. ప్రధానితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. ఇతర మంత్రులు.. ఇవాళ సాయంత్రం పుట్టపర్తి కి సీఎం చంద్రబాబు.
* అమరావతి: రేపు అన్నదాత సుఖీభవ.. పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చెయ్యనున్న ఏపీ ప్రభుత్వం.. 46 లక్షలకు పైగా ఉన్న రైతుల ఖాతాలోకి. 3135 కోట్లు జమ చెయ్యనున్న ప్రభుత్వం.. కడప జిల్లా లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు దళిత, గిరిజన, మైనార్టీలపై కొనసాగుతున్న దాడులకు వ్యతిరేకిస్తూ, జన గణనలో కుల గణన చేపట్టాలని సామాజిక న్యాయం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) ఆధ్వర్యంలో ఆందోళన
* కర్నూలు: నేడు కోడుమూరు (మం) లద్దగిరిలో శ్రీ రామదాసు తాత తిరునాళ్ల మహోత్సవాలలో భాగంగా పారువేట
* తిరుపతి: నేడు నగరంలోని సిపిఐ ఆఫీసిలో అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో పరకామణి బలోపేతం పై 108 మంది స్వామీజీలతో సమావేశం..
* తిరుమల: 12 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,208 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,135 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు
* నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. సిసిఐ తీరుకు వ్యతిరేకంగా పత్తి కొనుగోళ్లను నిలిపేసిన కాటన్ మిల్స్ అసోసియేషన్.. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన పత్తి కొనుగోలు.. పత్తి కొనుగోలు ఆగిపోవడంతో తెలంగాణలో అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ లో రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకునున్న మాజీ మంత్రి హరీష్ రావు
* ఆదిలాబాద్ జిల్లా కు జాతీయ అవార్డు.. జల్ సంచాయ్ జన్ భాగీధారి కి ఎంపిక . నేడు డిల్లీలో రాష్ట్ర పతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా
* ఖమ్మం: నేడు జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన మార్కెట్ యార్డ్ ని సందర్శించనున్న కవిత
* ఖమ్మం: నేడు మార్కెట్ యార్డును సందర్శించనున్న బీఆర్ఎస్ నేతలు వద్దిరాజు రవిచంద్ర, తాతా మధు, పత్తి రైతుల సమస్యలపై రైతులతో ముచ్చటించనున్న బీఆర్ఎస్ నేతలు
* పల్నాడు జిల్లా: నేడు నర్సరావుపేటలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన, నర్సరావుపేటలో రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే అరవిందబాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
* శ్రీ సత్యసాయి : రేపు పుట్టపర్తిలో ప్రధాని పర్యటన ఏర్పాట్లకు ప్రభుత్వం చర్యలు.. భక్తులకు ఏర్పాట్లు, రవాణా సౌకర్యాల కోసం ముగ్గురు ఐఏఎస్ ల నియామకం.. రేపు మహిళా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ప్రధాని.