Tragedy: అయ్యో దేవుడా.. కడుపులో ఉన్న కవలలు మృతి.. చికిత్స పొందుతూ తల్లి మృతి.. పిల్లలు, భార్య మృతి తట్టుకోలేక భర్త..
- శంషాబాద్ లో విషాదం
- గర్భిణి కడుపులో ఉన్న కవలలు మృతి
- చికిత్స పొందుతూ తల్లి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ దంపతులు పెళ్లై ఏడేళ్లైన పిల్లలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది ఆ మహిళ. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. విధి ఆడిన వింతనాటకంలో కడుపులోని పిల్లలతో సహా భార్యాభర్తలు కూడా మృతిచెందారు. ఈ విషాద ఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. భార్య కడుపులో ఇద్దరు కవలలు మృతి చెందారని డాక్టర్లు చెప్పడంతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలను ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ఐన్స్‌ప్సెక్టర్ బాల్‌రాజ్ వివరించారు… కర్ణాటక బెంగుళూరు రాష్ట్రానికి చెందిన ముత్యాల విజయ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ శంషాబాద్ లోని సామ ఎన్‌క్ల్యూవ్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. అయితే ప్రవీణ్ భార్య శ్రావ్య ఎనిమిది నెలల గర్భంతో ఉంది. ఆమెకు చెకప్ చేయించేందుకు అత్తాపూర్ లోని బట్టర్ ఫ్లై హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
Also Read:HIV Cases: పారిశ్రామిక వాడలో రోజురోజుకు పెరుగు తున్న హెచ్ ఐవీ కేసులు..
Also Read
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
వారి వెంట శ్రావ్య తల్లి కూడా వచ్చింది. బట్టర్ ఫ్లై హాస్పిటల్ డాక్టర్‌లు శ్రావణిని చెకప్ చేసి కడుపులో ఇద్దరు కవలలు ఉన్నారు వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. శ్రావ్యకు మెరుగైన చికిత్స అవసరం అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆమెను గుడిమల్కాపూర్ లోని మైత్రి హాస్పిటల్ కి తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించింది. దీంతో శ్రావ్యను హుటాహుటిన నగరంలోని సరోజిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న సమయంలో కడుపులో ఉన్న ఇద్దరు కవలలు శ్రావ్య మృతి చెందారు. విషయాన్ని శ్రావ్య తల్లికి డాక్టర్లు తెలియజేశారు. ఈ విషయాన్ని విజయ్ కు ఫోన్ ద్వారా చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన విజయ్ శంషాబాద్ లోని తన రూమ్ కు వెళ్లాడు.
Also Read:Priyanka Chopra : చీరలో ప్రియాంక చోప్రా.. కత్తిలాంటి అందాలు చూశారా
ఆ తర్వాత విజయ్ కోసం వెతికిన అతని మేనమామ ఫోన్ చేశాడు. కానీ విజయ్ రెస్పాండ్ కాకపోవడంతో హుటాహుటిన విజయ్ మేనమామ శంషాబాద్ లోని రూమ్ కు వచ్చి చూడగా రూమ్ లో విజయ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ మేనమామ విజయ్ అన్నయ్య ప్రవీణ్ కు ఫోన్ చేసి చెప్పగా హుటాహుటిన శంషాబాద్ లోని సామ ఎన్ క్లేవ్ కు చేరుకున్నాడు. చున్నీకి వేలాడుతూ ఉన్న తన తమ్ముణ్ణి చూసిన ప్రవీణ్ శోకసముద్రంలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ భార్య కడుపులో ఇద్దరు పిల్లలు తండ్రి ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయింది.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!