వీడు మనిషి కాదు.. మానవమృగం.. కన్నతల్లి నే కిరాతకంగా హతమార్చాడు.. బండరాయితో మోది తల్లిని చంపి పరారయ్యాడు. చంపింది కొడుకే అని తెలిసి.. గ్రామస్తులంతా షాక్ అయ్యారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని ఎందుకు చంపాడు..? హత్య చేసి.. ఆపై ఎలాంటి యాక్షన్ ప్లాన్ వేద్దామనుకున్నాడు..? ఇది వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామం. గ్రామానికి చెందిన 62 ఏళ్ల మల్లమ్మ రక్తపుమడుగులో పడి ఉంది. గమనించిన స్థానికులు వెళ్లి చూడగా… అప్పటికే మల్లమ్మ చనిపోయింది.…
కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు రాజ్ గోపాల్ రెడ్డి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు వచ్చాను. ఈరోజు విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకున్నాను.. నేను ఇక్కడికి బయలుదేరినప్పటి నుండి రాజకీయంగా నా పై దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను నిన్ననే మీడియా ముందు క్లారిటీ ఇచ్చాను.. కొంతమంది కావాలని నా ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మకండి.. నేను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదు అన్నారు..
హైదరాబాద్ సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 9 వర్టికల్ రంగాలకు ప్రత్యేకంగా న్యూసిటీ నిర్మాణం ఉంటుందని, కొత్త నగరం పేరు ‘భారత్ ఫ్యూచర్’ సిటీ అని చెప్పారు. భవిష్యత్ తరాలకు అవకాశాలను క్రియేట్ చేయడం తమ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. హైదరాబాద్కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తన డ్రీమ్ అని,…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖ కలకలం సృష్టిస్తోంది. చర్లలో భూస్వాములు, రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట లేఖ విడుదల అయింది. లేఖ రిలీజ్ కావడంతో మండలంలోని భూస్వాముల్లో, అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. పరుచూరి ప్రేమ్చంద్, పరుచూరి రవికుమార్, జవ్వాది రవికుమార్,…
అమెరికాలో తెలంగాణ యువకుడు హత్యకు గురయ్యాడు.. పోలీసుల కాల్పుల్లో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్ను పోలీసులు కాల్చి చంపారని.. పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.
Off The Record: అనర్హత పిటిషన్స్ విచారణలో భాగంగా… ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. వాళ్ళ నుంచి రిప్లయ్స్ కూడా వచ్చాయి. ఆ సమాధానాల ఆధారంగా… వాళ్ళ మీద వేటేయాలని ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్. ఆ నోటీసులకు సమాధానంగా… ప్రతిపక్షం తరపున మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేపీ వివేకానంద, చింత ప్రభాకర్ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి రిప్లై ఇచ్చారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన…