Ramreddy Damodhar Reddy Passes Away: మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రాంరెడ్డి దామోదర్రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 4వ తేదీన తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ హయాంలో ఐటీశాఖ మంత్రిగా పనిచేశారు రాంరెడ్డి…
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు ఆయన గారు. కానీ... కారులో పవర్ పోయాక ఏసీ ఆగిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారో ఏమోగానీ... ఠక్కున డోర్ తన్నుకుంటూ బయటపడ్డారు. తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా...జై తెలంగాణ నుంచి జై కాంగ్రెస్ అంటూ గోడ దూకేశారు దానం నాగేందర్.
వర్షంలో ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు.. విద్యార్థిని మృతి వర్షం పడుతుందంటే సెల్ఫోన్ మాట్లాడొద్దు.. టీవీలు ఆపేయండి.. అని ఇంట్లో పెద్దలు హెచ్చరిస్తుంటారు.. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు ఈ హెచ్చరికలు చేస్తుంటారు.. ఇప్పటికే పలువురిని ఈ పిడుగులు బలి తీసుకున్నాయి కూడా.. తాజాగా, ఆంధ్రప్రదేశ్లో మరో విద్యార్థిని పిడుగుపాటుకు బలైపోయింది.. అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకులోయలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అనంతగిరి మండలం పెదబిడ్డ పంచాయతీ చెరుకుమడత గ్రామంలో.. మంగళవారం పిడుగుపాటుకు…
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా... నిర్వహణపై నీలి నీడలు మాత్రం తొలిగిపోలేదు. ఎలక్షన్స్ జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి జీవో ఇవ్వడంతోపాటు ప్రాదేశిక నియోజకవర్గంలో కూడా 42 శాతం రిజర్వేషన్ అమలుకు నిర్ణయించింది.
సంగారెడ్డి జిల్లాలో అందోల్, జహీరాబాద్ రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్నాయి. అందోల్ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ తలపడుతున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన దామోదర... ప్రస్తుతం రేవంత్ కేబినెట్లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. మరోవైపు ఏసీబీలో ముగ్గురు అధికారుల అవినీతిపై విచారణ కొనసాగుతోంది.