సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఈరోజు రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి సింగరేణి ప్రస్థానం ప్రారంభమైందని, ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణికే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భట్టి చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. ‘తొలిసారి సైంటిఫిక్గా రాష్ట్రంలో కులగణన…
చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏపీకి విజనరీ నాయకత్వం ఉంది ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి.. ఏపీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఉంది.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తోంది అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అహోబిలం నరసింహస్వామి, మహానందీశ్వరుడికి నమస్కరిస్తున్నా.. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నా.. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన…
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరుగనున్నకేబినెట్ భేటీలో…
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకేమీ తెలియదని ఆమె భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి తెలిపారు. కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి తాను ఒక్కసారే వెళ్లాలని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ ఎంతో కష్టపడ్డామని.. వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్ రేవంతన్న అని పేర్కొన్నారు. సీఎం, తమకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కొండా మురళి స్పష్టం…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీల రిజర్వేషన్ల భవితవ్యం ఆధారపడి ఉన్న నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం ఏ తీర్పు ఇస్తుందోనని అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్న వారు…
Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం మాదే అని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భౌగోళికంగా విడిపోయినా.. మనుషులుగా కలిసి ఉన్నామన్నారు.. బంధుత్వాలు, స్నేహలు ఆంధ్ర, తెలంగాణ మధ్య అలాగే ఉన్నాయని అంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలుగు వారంతా కలిసి ఉండాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతుందని…
BC Reservation Case: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 పై స్టే విధించింది రాష్ట్ర హైకోర్టు.. అయితే, హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర సర్కార్.. ఈ మేరకు సోమవారం దాదాపు 50 పేజీలకుపైగా సమగ్రమైన సమాచారంతో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పులోని అంశాలపై కూలంకషంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది..అయితే, 42 శాతం బీసీ రిజర్వేషన్ పై…
Maoist Surrender: మావోయిస్టులకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. రేపు, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముందు ఆయన లొంగిపోతారు. ఆశన్నతో పాటు 70 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించనున్నారు.