Satyavathi Rathod: ఫార్ముల ఈ రేస్ కారు వ్యవహారంపై బీఆర్‌ఎస్ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమని ఆమె విమర్శించారు. కేటీఆర్ పై పెట్టిన కేసు అక్రమకేసు అని, 1992లో ఈ కార్ రెస్ నిర్వహించాలని చంద్రబాబు ప్రయత్నించినా.. ఇంతవరకూ ఎవరూ ఈ రేస్ ను తీసుకురాలేదన్నారు.
హైదరాబాద్ ను ప్రపంచ పటంలో కేటీఆర్ నిలిపాడని, ప్రధాని కూడా ఈ కార్ నిర్వహణకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.. కేవలం కేటీఆర్ మాత్రమే నిర్వహించాడని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరూ ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో.. HMDA నుండి డబ్బులు చెల్లించారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలు జేబు సంస్థగా మారాయని, న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉందన్నారు సత్యవతి రాథోడ్. గతంలో రేవంత్ ఎమ్మెల్యేలను డబ్బులతో కొనుగోలు చేస్తూ దొరికిన దొంగ అని ఆమె ఆరోపించారు. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో GHMC పరిధిలో సీట్లన్నీ BRS గెలవడం వల్ల కేటీఆర్ పై రేవంత్ కుట్రలు పన్నుతున్నారన్నారు. మీరు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. అవినీతి లేకున్నా ACB కేసు పెట్టిన KTR పేరు బద్నాం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేటీఆర్ హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే పని చేయడం తప్పా? అని ఆమె ప్రశ్నించారు. నిన్న మీరు ఓపెన్ చేసిన ఫ్లై ఓవర్ కూడా మా హయాంలోనిదే అని ఆమె వ్యాఖ్యానించారు. రాముడు ఎంత నిజాయితీగా ఉన్నాడో.. మా రాముడు కూడా నిజాయితీగా అన్నారని, మోసం, అబద్ధాలు, కేసులు తప్ప మీరు చేసింది ఏమీ లేదన్నారు. హామీలు అమలు చేయడం చేత కానీ దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అని, జైలుకి వెళ్లి వచ్చిన రేవంత్ అందర్నీ జైలుకు పంపించాలని చూస్తున్నారు.. ప్రపంచం మొత్తం తిరిగివచ్చిన కేటీఆర్ ప్రపంచ పెట్టుబడులను తెచ్చాడన్నారు.
మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల గొంతుకగా కేటీఆర్, హరీష్ రావు లు ఉన్నారని, ఏడాది తర్వాత ఇప్పుడు కేసు గుర్తుకు వచ్చిందా? అని ఆమె అన్నారు. IT సెక్టార్ లో బెంగళూర్ ను కాదని హైదరాబాద్‌ను కేటీఆర్ మొదటి స్థానానికి తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చ పెట్టమంటే.. ప్రభుత్వం తప్పించుకుందని, ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే తప్ప.. ఈ కేసులో అవినీతి జరగలేదన్నారు సునీతా లక్ష్మారెడ్డి.
Naga Vamsi: కొడతానంటే హీరోయిన్స్ ఒప్పుకోలేదు.. అందుకే ఊర్వశిని తీసుకున్నాం: నాగవంశీ