* చిత్తూరు: నేడు కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. టీడీపీ కార్యాలయంలో జన నాయకుడు సెంటర్ ప్రారంభించనున్న చంద్రబాబు.. ప్రజలనుంచి వినతులు స్వీకరణ… అనంతరం కుప్పం పార్టీ కేడర్ తో సమావేశం.. మధ్యాహ్నం 12.20 గంటలకు కంగుంది గ్రామంలో దివంగత శ్యామన్న విగ్రహావిష్కరణ.. 1.20 గంటలకు కుప్పంలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 92 కోట్లు సంబందించిన కడలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..
* అమరావతి: నటి జిత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద నేడు ఏపీ హైకోర్టు తీర్పు.. ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని, ఏసిపి హనుమంతు రావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ వెంకటేశ్వర్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు
* అమరావతి: మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ.. రేషన్ బియ్యం మాయం కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేసిన పేర్ని నాని
* అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. ఏసీబీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన ఐపీఎస్ సంజయ్
* హైదరాబాద్: ఈరోజు అల్వాల్ లోని టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
* హైదరాబాద్: నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల ముగిసిన వాదనలు.. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వ్.. ఉదయం 10:30 న్నర గంటల సమయాన తీర్పు వెల్లడించనున్న హైకోర్టు..
* ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ సేవల నిలుపుదలపై ప్రభుత్వం దృష్టి.. ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశంలో పెండింగ్ లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లులు, ఇతర సమస్యలపై చర్చ.. వచ్చే ఏప్రిల్ 1 నుంచి బీమాలోకి ఎన్టీఆర్ వైద్య సేవ పెండింగ్ బిల్లులతో అనేక రకాల ఇబ్బందులు..
* ఢిల్లీకి మంత్రి పొన్నం ప్రభాకర్.. నేడు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే.. అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొననున్న మంత్రి పొన్నం ప్రభాకర్..
* హైదరాబాద్: కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ నీ పరామర్శించేందుకు నేడు అల్లు అర్జున్ కిమ్స్ కి రానున్నారు… ఇప్పటికే పలుమార్లు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వస్తున్నట్లుగా చెప్పి చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు… పోలీసుల అనుమతితో కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ ఇవాళ రానున్నారు…
* కామారెడ్డి : నేడు జిల్లాలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన.. బాన్సువాడలో ఎక్సైజ్ శాఖ నూతన కార్యాలయం ప్రారంభించనున్న మంత్రి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,
* నిజామాబాద్ : నేడు జిల్లాకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. డిచ్ పల్లి కే.ఎన్.ఆర్. గార్డెన్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్న పీసీసీ అధ్యక్షుడు, ఎం.ఎల్. ఏ.లు ఎం.ఎల్.సి. ఇతర ముఖ్య నేతలు.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు , పార్టీ అంతర్గత వ్యవహారాల పై చర్చ.
* విశాఖలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి..
* మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో ఉంటారు…
* ప్రకాశం : గిద్దలూరులో ప్రభుత్వ ఆదేశాల మేరకు పింఛన్ దారుల ఇంటి వద్దకు వెళ్లి ధ్రువపత్రాల విచారణ చేపట్టనున్న అధికారులు..
* రాష్ట్ర పురపాలక… పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు టిడిపి నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు
* నేడు పల్నాడు జిల్లాలో పెన్షన్ల వెరిఫికేషన్… నరసరావుపేట , వినుకొండ ,మాచర్ల , క్రోసూరు మండలాలతోపాటు ,పిడుగురాళ్ల పట్టణంలో ,జరగనున్న వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్…
* బాపట్ల: నేడు కర్లపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం…
* విజయవాడ: నేడు పోలిటెక్ ఫెస్ట్ ప్రదర్శనకు మంత్రి నారా లోకేష్..
* అనంతపురం : జిల్లాలో నాలుగు విడతల్లో ప్రాథమిక గొర్రెల పెంపకం సహకార సంఘాలకు ఎన్నికలు.నేటి నుంచి ప్రక్రియ ప్రారంభించనున్న అధికారులు.
* అనంతపురం : విజయవాడ పర్యటనలో ఉన్న మంత్రులు పయ్యావుల కేశవ్ , సత్యకుమార్ , సవిత.
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన సేవ,విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ..
* నంద్యాల: ఆత్మకూరులో నేటి నుండి మూడు రోజుల పాటు ముస్లిం మైనార్టీల తబ్లీగ్ ఇస్తేమా.. హజరుకానున్న లక్షలాది మంది ముస్లింలు.. 500 మంది పోలీసులతో బందోబస్తు
* నంద్యాల రెండవ తాసిల్దారు ఆఫీస్ ను నేడు ప్రారంభించనున్న మంత్రి ఫారుక్.. చంద్రశేఖర కాళికాంబ ఆలయంలో నేడు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ , సాయంత్రం పల్లకి సేవ, మహా మంగళారతులు
* తూర్పుగోదావరి జిల్లా: రెండోవ రోజు కొనసాగుతున్న రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్.. కొనసాగుతున్న కార్మికుల ఆందోళన.. కార్మికులకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు, వేతన సవరణ చేయాలని డిమాండ్
* విజయనగరం: రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేటి కార్యక్రమాలు.. ఉదయం 9.00 గంటలకు గజపతినగరం మండలం, మరుపల్లిలో గ్రామములోగల శ్రీ బాలాజీ పాలిటెక్నిక్ కాలేజిలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 11.00 గంటలకు బొబ్బిలిలో గౌరవ శాసనసభ్యులు శ్రీ RVSKK రంగారావు (బేబీనాయన) గారి ఆధ్వర్యంలో నిర్వహించు శ్రీమతి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి (హోమం) కార్యాక్రమములో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ నెల 08న విశాఖలో జరగనున్న ప్రధానమంత్రి పర్యటన సభాస్థలిని, ఏర్పాట్లను పరిశీలించుటకు వెళ్లనున్నారు.
* నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీతక్క. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు, పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి. గోవిందారావు పేట మండలం చల్వాయి పిఎస్ఆర్ గార్డెన్ లో మెగా జాబ్ మేళకు హాజరు కానున్న మంత్రి
* భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. అధ్యయనోత్సవాలలో భాగంగా ఎనిమిదివ రోజు అయిన నేడు బలరామవతారంలో భక్తులకు దర్శనమివనున్న స్వామి వారు.
* నేడు జిల్లాలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన