దశాబ్దాల పోరాటం, నిరీక్షణకు తెర… రేపే ప్రధాని మోడీ శ్రీకారం..
రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లోవ దగ్గర రైల్వేకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ సముదాయం రూపుదిద్దుకోనుంది. ఇక్కడ రైల్వేశాఖకు 52 ఎకరాల స్థలం ఉండగా, సుమారు పదెకరాల్లో కొత్త భవనాలు వస్తాయి. 149 కోట్లతో 9 అంతస్తుల్లో భవనాలు నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది రైల్వేశాఖ. వాస్తవానికి దక్షిణ కోస్తా జోన్ ప్రక్రియ వైసీపీ ప్రభుత్వ హయంలోనే ప్రారంభమైనప్పటికీ భూ కేటాయింపుల్లో జాప్యం జరిగిందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ముడసర్లోవలో ప్రతిపాదించిన భూములు రిజర్వాయర్ క్యాచ్ మెంట్ ఏరియాకు దగ్గరగా వుండటం, సాగు చేసుకుంటున్న రైతుల నుంచి అభ్యతరాలు రావడం కారణం. కూటమి ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత జోన్ భూములపై వున్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. చినగదిలి మండలం ముడసర్లోవలో 52.22 ఎకరాలు కేటాయించింది. గత ఆగస్టులో ఆ భూమిని రైల్వేకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. మ్యుటేషన్ ద్వారా రైల్వేశాఖకు భూమి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లోనూ నమోదైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రైల్వేజోన్ మైల్ స్టోన్ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.. రైల్వే జోన్ కోసం భూముల కేటాయింపులో జాప్యం కారణం అవ్వడం పై అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. గత ఏడాది జనవరిలోనే తమ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందని.. అదే భూముల్లో జోనల్ కార్యాలయం నిర్మాణం చేస్తూ విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ వ్యవహారం పక్కన పెడితే.. తూర్పు కోస్తా రైల్వే జోన్ లో వాల్తేర్ డివిజన్ ప్రస్థానంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ముంబై నటి జత్వానీ కేసు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు..
సంచలనం సృష్టించిన ముంబై సినీనటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది.. ఈ కేసులో ఐపీఎస్ అధికారులకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. కాగా, జత్వానీ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంత రావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ వెంకటేశ్వర్లు.. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు.. ఐపీఎస్ ఆఫీసర్స్‌తో పాటు పోలీసులు అధికారులకు ఊరట కల్పిస్తూ.. కొన్ని షరతులు విధిస్తూ.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.. కాగా, గత ప్రభుత్వంలో తనను వేధింపులకు గురిచేశారంటూ.. కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు నటి జత్వానీ.. ఆ తర్వాత కేసు నమోదు చేయడం.. ఈ వ్యవహారంలో కలగజేసుకున్నారన్న అభియోగాలతో ఐపీఎస్ అధికారులు సహా.. పలువురు పోలీసు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం విదితమే..
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. బ్రేక్ దర్శనాలు రద్దు
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేశారు టీటీడీ అధికారులు.. శ్రీవారి ఆలయంలో ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాని వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆలయంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ వస్తున్న విషయం విదితమే.. ప్రతి ఏడాది.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కారణంగా ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవను, వీఐపీ బ్రేక్ దర్శనాలును టీటీడీ రద్దు చేసింది.
ప్రధాని మోడీ పర్యటనకు చకచకా ఏర్పాట్లు.. విశాఖలో ఆంక్షలు..
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధం అవుతోంది.. విశాఖలో రేపు జరగబోయే ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్ని SPG ఆధీనంలోకి తీసుకుంది.. AU ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.. బయట నుండి వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచనున్నారు పోలీసులు.. ఇక, నేడు, రేపు సభా పరిసర ప్రాంతాల్ల్ నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై విధించారు.. ఈ నేఫథ్యంలో సభా ప్రాంగణంలో 5000 మంది పోలీసులు చేరుకుంటున్నారు… 35 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.. సిరిపురం దత్ ఐ ల్యాండ్ నుండి సభా ప్రాంగణం వరకు సుమారు 1.5 కిలో మీటర్ల రోడ్ షో జరగనుంది.. ఈ రోడ్ షో 45 నిముషాల పాటు కొనసాగనుంది. సభా ప్రాంగణం దగ్గరే కావడంతో ప్రజలకు అభివాధం చేస్తూ రోడ్ షో నెమ్మదిగా సాగనుంది.. రోడ్ షో లో మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనున్నారు.. ఉత్తరాంధ జిల్లాల నుండి సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు.. విశాఖలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ సభకు, రోడ్ షో కు చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు లో నిమగ్నమయ్యారు అధికారులు.. మరో వైపు కూటమి నాయకులు వరుస సమీక్షలు నిర్వహిస్తు బిజీ బిజీగా కనిపిస్తున్నారు… రేపు సుమారు మూడు లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా ప్లానింగ్ చేస్తున్నారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రజల తరలింపుకు సుమారు 7000 వాహనాల కేటాయించారు.. సభకు హాజరయ్యే ప్రజల కోసం సుమారు 3 లక్షల ఆహార పొట్లాలు సిద్ధం చేయనున్నారు.. ప్రధాని టూర్ దృష్ట్యా రేపు ఉమ్మడి విశాఖలో పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. రూట్, రోప్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, డామినేషన్ టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాట్లు ట్రైల్ రన్స్ జరుగుతున్నాయి..
“అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్‌పై కేసు పెట్టారు “.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
హై కోర్టు తీర్పుపై న్యాయవాదులతో మాట్లాడుతున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ.. “కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టారు. ఈ ఏడాదిలో అన్ని విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అని సర్వే రిపోర్ట్ వచ్చింది. అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు పెట్టారు. కుట్ర తో చేస్తున్నారు అని క్లియర్ గా తెలుస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నోటీస్ ఇచ్చినందుకు కేటీఆర్ విచారణకు వెళ్లారు. ప్రభుత్వం తీరు బాగా లేదు అని న్యాయవాదులతో కలిసి వెళ్తాను అన్నారు. అరగంట సేపు రోడ్డు మీదనే ఉన్నారు. కేటీఆర్ మళ్ళీ విచారణకు వెళ్తాడు కక్ష సాధింపునకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. ఇది కుట్రపూరితంగా పెట్టారు. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి.. కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు.” అని హరీశ్ రావు పేర్కొన్నారు. కోర్టు కేసును కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. “తప్పు జరిగింది అని కోర్టు చెప్పలేదు. ఇదొక తుఫెల్ కేసు. 9 వ తేదీ ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్తారు. ఇవాళ అరెస్ట్ చేస్తారా? రేపు అరెస్ట్ చేస్తారా? వాళ్ళ ఇష్టం. విచారణకు పూర్తిగా సహకరిస్తాం. అడ్వకేట్ లు వెళితే తప్పేంటి? రాహుల్ గాంధీ విచారణ కు వెళితే… అడ్వకేట్ లు కూడా వెళ్లారు. గతంలో గ్రీన్ కో కు మేము ఏమి ఇవ్వలేదు. గ్రీన్ కోకు మేము లాభం చేకూర్చినట్లు ఎక్కడా లేదు. ఇక్కడ అవినీతి కి ఆస్కారం లేదు. కాళేశ్వరం ఇష్యూ తర్వాత మాట్లాడదాం. కోర్ట్ జడ్జిమెంట్ వచ్చాక పై కోర్టుకు వెళ్లాలా వద్దా అనేది మా లీగల్ టీమ్ తో చర్చిస్తాం.” అని తెలిపారు.
కోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు.. పలు చోట్ల తనిఖీలు
హైకోర్టు తీర్పుతో దూకుడు ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా-ఈ రేసు కేసులో పలు చోట్ల ఏసీబీ తనిఖీలు చేపట్టింది.. హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. హైదరాబాద్‌లోని గ్రీన్ కో కార్యాలయాల్లో, ఏస్ నెక్ట్స్‌కు సంబంధించిన కంపెనీ, హైటెక్ సిటీలోని ఏస్ అర్బన్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.. ఏస్ నెక్ట్స్ ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మొదటి దఫా పార్ట్‌నర్‌గా ఉంది. ఫార్ములా ఈ రేసులో భాగస్వామిగా గ్రీన్‌కోను అనుమానిస్తుంది.. బీఆర్ఎస్‌కు గ్రీన్‌కో నుంచి భారీగా ఎలక్టోరల్ బాండ్లు అందినట్లు.. క్విడ్‌ప్రోకో జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.. రూ.41 కోట్లు బీఆర్ఎస్‌కు బాండ్ల రూపంలో చెల్లించి ప్రతిసారీ కోటి రూపాయల బాండ్‌ను బీఆర్ఎస్‌కు చెల్లించినట్లు ఏసీబీ తెలిపింది. మరోవైపు ఈడీ.. ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-రేసు కేసును అటు ఏసీబీ, ఇటు ఈడీ విచారిస్తున్నాయి. విచారణకు హాజరు కావాలని ఈడీ మాజీ మంత్రికి తెలిపింది. జనవరి 7న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసు ఇచ్చింది. మంగళవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ మెయిల్ పంపారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో.. తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని విన్నవించారు. అయితే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు స్పందించారు. విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈడీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
బీఆర్‌ఎస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్.. లీగల్ టీమ్‌తో కేటీఆర్ చర్చలు
హై కోర్డులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేటీఆర్ అరెస్ట్‌పై స్టేను సైతం ఎత్తివేయడంతో టెన్షన్ పెరిగింది. దీంతో నంది నగర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రి లీగల్ టీమ్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. హై కోర్టు ఫుల్ బెంచ్ వెళ్లాలా? సుప్రీంకోర్టుకు వెళ్లాలా? అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఏసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనే దానిపై బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇప్పటికిప్పుడు ఏమి చేయాలి అనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-రేసు కేసును అటు ఏసీబీ, ఇటు ఈడీ విచారిస్తున్నాయి. విచారణకు హాజరు కావాలని ఈడీ మాజీ మంత్రికి తెలిపింది. జనవరి 7న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసు ఇచ్చింది. మంగళవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ మెయిల్ పంపారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో.. తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని విన్నవించారు. అయితే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు స్పందించారు. విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈడీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
ఆరుగురు పిల్లలను భర్త దగ్గర వదిలి.. బిచ్చగాడితో లేచిపోయిన భార్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల వివాహిత.. భర్త వద్ద ఆరుగురు పిల్లలను వదిలేసి.. ఓ బిచ్చగాడితో వెళ్లినట్లు పోలీసు కేసు నమోదు అయింది. దీంతో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 87 ప్రకారం.. భర్త రాజు కంప్లైంట్ చేశాడు. అయితే, ఆ బిచ్చగాడిపై మహిళ అపహరణ కేసు ఫైల్ చేశారు. కేసు బుక్ చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా, హర్దోయ్‌లోని హర్పల్ పూర్ లో జీవనం కొనసాగిస్తున్న 45 ఏళ్ల రాజుకు.. రాజేశ్వరి అనే మహిళతో పెళ్లైంది. వీరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే, నానే పండిత్ అనే బిచ్చగాడు వారి ఇంటి పరిసరాల్లో అడుక్కునేవాడు.. కొన్ని సందర్భాల్లో భార్య రాజేశ్వరితో అతను మాట్లాడుతు ఉండేవాడని రాజు తన కంప్లైంట్ లో తెలియజేశాడు. ఫోన్‌లో కూడా వారు పలుమార్లు సంభాషించినట్లు చెప్పుకొచ్చాడు. అయితే, జనవరి 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి.. కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్తున్నట్లు కూతురు ఖుష్బూకు భార్య రాజేశ్వరి చెప్పినట్లు ఫిర్యాదులో రాజు తెలిపాడు. ఎప్పటికి ఆమె తిరిగి రాకపోవడంతో భార్య కోసం వెతికాడు.. ఓ బర్రెను అమ్మితే వచ్చిన డబ్బులతో తన భార్య రాజేశ్వరి వెళ్లిపోయిందన్నాడు.. ఇక, భార్యను నానే పండిట్ అనే బిచ్చగాడు తీసుకెళ్లి ఉంటాడని రాజు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో నానే పండిట్ పై బీఎన్ఎస్‌లోని సెక్షన్ 87 కింద కేసు నమోదు చేశారు. ఆ చట్టం ప్రకారం నిందితుడికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.
పరిపాలనను జో బైడెన్ కష్టతరంగా మారుస్తున్నాడు..
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ తన చివరి సమయంలో తీసుకుంటున్న అధికారిక నిర్ణయాలతో పరిపాలనను, అధికార బదిలీని కష్టతరం చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తాను అధికారం తీసుకోవడానికి ముందే ఎన్ని కష్టతరమైన మార్పులు సాధ్యమో అన్నీ చేస్తున్నారని విమర్శించారు. న్యాయవ్యవస్థలో ఇలా జరగడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అర్థంలేని పరిపాలనా ఉత్తర్వులు ఇచ్చి గ్రీన్ న్యూ స్కామ్, ఇతర రకాలుగా డబ్బును వృథా చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. ఈ ఉత్తర్వులతో అమెరికా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. తాను అధికారంలోకి రాగానే వాటిని తొలగిస్తానని హామీ ఇచ్చారు. తన పాలనలో యూఎస్ ను మరింత శక్తివంతమైన దేశంగా నిలబెడతానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
అమెరికాకు నార్త్ కొరియా వార్నింగ్.. అది హైపర్ సోనిక్ క్షిపణి అంటూ వెల్లడి
దక్షిణ కొరియా, జపాన్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ పర్యటిస్తున్న సందర్భంగా ఉత్తర కొరియా హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది. దీంతో పసిఫిక్ సముద్రంలో ఉన్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఈ మిస్సైల్ ఎదుర్కోగలదని నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఇది కచ్చితంగా మా భద్రతను పెంచుతుందని వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని కిమ్ స్వయంగా దగ్గర ఉండి తిలకించారని ది కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) తెలిపింది. ఇక, ఈ క్షిపణి శబ్ధం కంటే 12 రెట్ల వేగంతో 1,500 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడిపోయిందని ఉత్తర కొరియా తెలిపింది. కానీ, దక్షిణ కొరియా మాత్రం ఇది కేవలం 1,100ల కిలోమీటర్లు మాత్రమే జర్నీ చేసిందని చెప్పుకొచ్చింది. అయితే, గతేడాది నవంబర్ నుంచి ఇది తొలి మిసైల్ టెస్ట్ మాత్రమే.. ఈ క్షిపణి కేవలం ఆత్మరక్షణ ప్రణాళికలో భాగంగా తయారు చేసింది.. ఇది దాడి చేయడానికి ఉద్దేశించింది కాదని పేర్కొనింది. అలాగే, ఈ మిసైల్‌ను ప్రపంచం విస్మరించొద్దు.. ఎంతటి రక్షణ వ్యవస్థలనైనా ఛేదించుకొని వెళ్లి ప్రత్యర్థిపై దాడి చేస్తుందన్నారు. మా దేశ రక్షణ సామర్థ్యాలను పెంచుకొనే పనిని భవిష్యత్తులో మరింత వేగవంతం చేస్తామని కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు.
గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన వెండి!
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్త ఏడాదిలో వరుసగా మూడు రోజులు పెరిగిన పసిడి.. ఆపై మూడు రోజులుగా స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జనవరి 7) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,150గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,710గా నమోదైంది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర నేడు రూ.1000 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్షకు చేరింది.
శుభ్‌మన్ గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్: శ్రీకాంత్
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శల వర్షం కురిపించారు. గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని పేర్కొన్నారు. గిల్‌కు ఇన్ని అవకాశాలు లభిస్తున్నప్పుడు.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. జాతీయ జట్టుకు ఆడే అర్హత ఉన్న ఆటగాళ్లను బీసీసీఐ సెలక్టర్లు విస్మరిస్తున్నారని శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. యువ ప్లేయర్లను సెలక్టర్లు ప్రోత్సహించాలని సూచించారు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత్ 1-3తో ఓడిన విషయం తెలిసిందే. వరుస ఓటములతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి టీమిండియా నిష్క్రమించింది. భారత ఆటగాళ్లలో జస్ప్రీత్ బుమ్రా (31 వికెట్స్) మాత్రమే రాణించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దారుణంగా విఫలమయ్యారు. శుభ్‌మన్ గిల్ 5 ఇన్నింగ్స్‌ల్లో 93 రన్స్ మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. అదే సమయంలో బీసీసీఐ సెలక్టర్లకు సైతం చురకలు అంటించారు.
ఆస్కార్ బరిలో సూర్య కంగువా
గతేడాది తమిళ్ లో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది కంగువ. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తడబడింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కంగువా అన్ని లాంగ్వేజెస్ లో ప్లాప్ గా మిగిలింది. కానీ ఇప్పుడు అదే కంగువ ఇండియన్ సినిమా గర్వించే దిశగా దూసుకెళుతోంది. 2024 తమిళ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ కంగువ ఇప్పుడు ఆస్కార్ రేసులో నిలిచింది. 2025 వ ఆస్కార్ అవార్స్ కోసం మొత్తం వరల్డ్ వైడ్‌గా 323 సినిమాలు పోటీ పడగా వాటిలో నుండి 207 సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి. వాటిలో మన భారతదేశానికి చెందిన మూడు సినిమాలు ఆస్కార్స్ లిస్టు లో చోటు దక్కించుకున్నాయి. 97వ ఆస్కార్ బరిలో నిలిచిన కంగువా ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడుతోంది. ఇండియా నుండి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ఆడు జీవితం’, తమిళ సినిమా ‘కంగువా’ తో పాటు ‘ స్వతంత్ర వీర్ సావర్కర్’ కూడా ఈ లిస్ట్ లో చోటు సంపాదించాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మాతగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచింది. కానీ షార్ట్ లిస్ట్ లో స్థానం సంపాదించ లేక వెనుతిరిగింది.
శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీసిన అల్లు అర్జున్.
పుష్ప -2 రిలీజ్ రోజు న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. శ్రీ తేజ్ పరామర్శించి శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీశారు అల్లు అర్జున్. అలాగే తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఓదార్చాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత FDC ఛైర్మెన్ దిల్ రాజు కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి బాలుడ్ని పరామర్శించారు. పోలీసుల అనుమతితో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించాడు. బన్నీ రాకతో కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు పోలీసులు. అల్లు అర్జున్ కు ఎస్కార్ట్ వాహనం తో సెక్యూరిటీ ఇచ్చారు పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ్ కొన ఊపిరితో కిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గత 35 రోజులుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శ్రీ తేజ తల్లి రేవతి ఇప్పటికే మరణించడంతో తండ్రి భాస్కర్ శ్రీ తేజని చూసుకుంటున్నారు. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపాడు అల్లు అర్జున్. ఇప్పటికే పుష్ప నిర్మాతలు మైత్రి మూవీస్, హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి రెండు కోట్ల రూపాయల చెక్ శ్రీ తేజ తండ్రి కి అందజేశారు. పరామర్శ అనంతరం కిమ్స్ ఆసుపత్రి నుండి వెళ్లిపోయాడు అల్లు అర్జున్.