* నేడు ఏపీకి ప్రధాని మోడీ.. ఏపీ ప్రజల తరపున ప్రధానికి స్వాగతం పలుకుతున్నాం.. ప్రధాని రాకకు విశాఖతో సహా ఎదురు చూస్తున్నాం.. రూ.2 లక్షల కోట్ల విలువైన పనులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు-సీఎం చంద్రబాబు
* నేడు విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని మోడీ రోడ్ షో.. సాయంత్రం 5.30కి బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ
* నేడు జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్.. ఐకేపీ, సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ నిర్వహిస్తున్నర సోలార్ పవర్ ప్రాజెక్టులపై చర్చ
* నేడు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్న కేటీఆర్.. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీని ఆదేశించాలని కోరనున్న కేటీఆర్.. న్యాయవాది సమక్షంలో కేటీఆర్‌ను విచారించేందుకు నిరాకరించిన ఏసీబీ.. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
* ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో నేడు ఏసీబీ, ఈడీ విచారణ.. నేడు విచారణకు హాజరుకానున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్.. అరవింద్ కుమార్ ను విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న ఏసీబీ.. ఈడీ విచారణ హాజరుకానున్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి..
* అమరావతి : ఇవాళ తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం.. హాజరుకానున్న నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు.. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై చర్చించనున్న జగన్.. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధినేత జగన్..
* అమరావతి : లండన్ వెళ్లేందుకు వైసీపీ అధినేత జగన్ కు అనుమతి ఇచ్చిన హైకోర్టు.. తాజా పాస్ పోర్టు పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తూ హైకోర్టు తీర్పు..
* విశాఖలో ప్రధాని పర్యటనలో సీఎం చంద్రబాబుతో కలసి జిల్లా ఇంఛార్జ్ మంత్రి హోదాలో పాల్గొననున్న డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి..
* బాపట్ల : కొరిసపాడు మండలం రావినూతలలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించనున్న బాపట్ల ఎంపీ తిన్నేటి కృష్ణ ప్రసాద్..
* ప్రకాశం : డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై కస్టోడియల్ టార్చర్ కేసులో ఇవాళ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట విచారణకు హాజరుకానున్న కామేపల్లి తులసి బాబు.. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేసినట్లు కామేపల్లి తులసిబాబుపై అభియోగాలు..
* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం అవుతారు
పల్నాడు
* ఏపీ: నేడు విశాఖలో ప్రధాని మోడీ పర్యటన.. రోడ్ షో, బహిరంగలో పాల్గొనున్న ప్రధాని మోడీ.. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని.. NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్, రైల్వేజోన్, క్రిస్ సిటీ పనులకు శ్రీకారం.. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై ప్రకటన చేసే అవకాశం.
* విశాఖ: ప్రధాని పర్యటనలో హైలెట్ గా రోడ్ షో.. సిరిపురం జంక్షన్ నుంచి ఎయు గ్రౌండ్స్ వరకు సుమారు కిలోమీటర్ ర్యాలీ.. 45 నిముషాలు పైగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లనున్న ప్రధాని.. రోడ్ షో లో మోడీ వెంట చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. భారీ ఏర్పాట్లు చేసిన కూటమి పార్టీలు.. లక్ష మందితో ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా సన్నాహాలు…
* విశాఖ: ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు.. ఆంధ్రా యూనివర్శిటీ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్న SPG .. 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు… బందోబస్తు విధుల్లో 32 మంది ఐ.పి.ఎస్ అధికారులు,18 మంది అడిషనల్ ఎస్.పి లు,60 మంది డి.ఎస్.పి లు ,180 మంది సిఐలు,400 మంది ఎస్. ఐ లు..
* విశాఖ: ప్రధాని పర్యటనలో పోలీసులు ముందస్తు చర్యలు… వామపక్ష, కార్మిక సంఘాలకు చెందిన పలువురు నాయకులకు నోటీసులు, హౌస్ అరెస్ట్
* విశాఖ: ప్రధాని బహిరంగ సభ వేదికపై 13మందికి అవకాశం… ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు పార్టీ అధ్యక్షులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఛాన్స్.. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు లోకేశ్, సత్యకుమార్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, ఎంపీలు ఎం.శ్రీభరత్, సీఎం రమేశ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ వేదికపై కూర్చొనే అవకాశం
* అమరావతి: డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరలు పెంచటాన్ని సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై నేడు హైకోర్టు విచారణ.. బెన్ ఫిట్ షో అనుమతి ఇవ్వటం వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుందనీ ప్రస్తావించిన పిటిషనర్.. హైదరాబాద్ సంధ్య ధియేటర్ ఘటన వల ఒకరు మృతి చెందారని, FIR పిటిషన్ జత చేసిన పిటిషనర్.. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలు పెంచారని పిల్.. నేడు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు
* విజయవాడ: నేడు ముగియనున్న పాలిటీక్ ఫెస్ట్ ప్రదర్శన.. మూడు రోజులపాటు జరిగిన ప్రదర్శన
* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మ.12 గంటలకు విశాఖ చేరుకోనున్న పవన్.. సా.4:15 గంటలకు INS డేగాలో చంద్రబాబుతో కలిసి.. మోదీకి స్వాగతం పలకనున్న పవన్.. సా.4:45 నుంచి మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ రోడ్‌షో.. సా.5:30 గంటల నుంచి ప్రధాని మోదీ బహిరంగసభ.. రాత్రి 7:25 గంటలకు గన్నవరం బయల్దేరనున్న పవన్…
* తిరుమల: రేపు ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చెయ్యనున్న టీటీడీ.. తిరుపతిలో 8 ప్రాంతాల్లో.. తిరుమలలో 1 ప్రాంతంలో టోకెన్లు జారీ చెయ్యనున్న టిటిడి .. మూడు రోజులుకు సంబంధించిన లక్షా 20 వేల టోకెన్లు జారీ చెయ్యనున్న టిటిడి
* అమరావతి: కర్నూలు విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్.. తనపై నంద్యాల జిల్లా రుద్రవరం పోలిసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్.. నేడు విచారణ చేయనున్న హైకోర్టు
* తిరుమల: కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తూన్న టిటిడి.. ఇవాళ తిరుమల నుంచి ప్రయాగాకు భయలుదేరి వెళ్లనున్న శ్రీవారి కళ్యాణ రథం
* ప్రకాశం : మార్కాపురంలో వైసీపీని విడి టీడీపీలోకి భారీగా చేరికలు.. రేపు ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఆనం, గొట్టిపాటి, డోలా సమక్షంలో టీడీపీలో చేరుతున్న వైసిపి ముఖ్య నేతలు, కౌన్సిలర్లు. మున్సిపాలిటీలో కొనసాగుతున్న వైసిపి కౌన్సిలర్ల రాజీనామాల పరంపర…
* అనంతపురం : నేడు జడ్పీలో స్థాయి సంఘ సమావేశాలు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన కార్యక్రమాల వివరాలు .. ఉదయం 06:00 గంటలకు రాజమండ్రి నుండి విశాఖపట్నం పయనం. అనంతరం విశాఖపట్నంలో ప్రధానమంత్రి విశాఖ పర్యాటన కార్యక్రమంలో పాల్గొంటారు.
* తూర్పుగోదావరి: నేటి నుండి రెండు రోజులు పాటు రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు.. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో వరుసగా రెండో ఏడాది తెలుగు మహాసభలు.. హాజరుకానున్న 560 మంది కవులు
* ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత.. సంగారెడ్డి జిల్లా కోహిర్ 9.3, న్యాల్కల్ 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత.. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ 12.4 మిరుదొడ్డి 12.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. మెదక్ జిల్లా మనోహరబాద్ 12.8, టెక్మాల్ 12.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
* నేడు భద్రాచలం శ్రీ సీతారామ చం ద్రస్వామి వారి దేవస్థానం అలాయం లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమివనున్న స్వామి వారు. రేపు సాయంత్రం గోదావరి నది తీరాన హంస వాహనంపై స్వామివారి తెప్పోత్సవం. 10న ఉత్తర ద్వార దర్శనం
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,566 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 16,021 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.3.2 కోట్లు
* చిత్తూరు: కుప్పం సీఎం చంద్రబాబు మూడోరోజు పర్యటన.. కార్యకర్తలతో సమావేశం ,ఆర్జీల స్వీకరణ… అనంతరం విశాఖపట్నం పయనం