Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి వంటి పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోనివారికి ఇప్పుడు వెసులుబాటు కల్పిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుండి ప్రారంభమైన గ్రామ సభల్లో ఈ పథకాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వర…
కృష్ణా జలాల వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చెబుతున్నది పచ్చి అబద్ధం అని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తేల్చేసారని హరీష్ రావు ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..? అని దుయ్యబట్టారు. మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని హరీష్ రావు ఆరోపించారు.
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బహిరంగ విచారణకు హాజరు కావాలంటూ రామకృష్ణారావుకు కాళేశ్వరం కమిషన్ సోమవారం సమన్లు పంపింది.
రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడానికి కూడా అవకాశం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి పొన్నం జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేషన్ కార్డులకు సంబంధించి సర్వే కొనసాగుతోందన్నారు.
రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు.