పవన్ కల్యాణ్ సాధిస్తారు..! ఏపీకి ఆశాజ్యోతి ఆయనే..
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. ఏపీకి పవన్ కల్యాణ్ ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారని పేర్కొన్నారు.. ఇప్పుడు రాష్ట్ర అవసరాలు, విభజన హామీలు సాధించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.. మన రాష్ట్రం మీద ఆధారపడి కేంద్రం వుంది. ఇదే అదును.. ఇప్పుడే డిమాండ్స్ సాధించుకోవాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే లా ప్రకారం వెళ్తుందనే నమ్మకం నాకుంది.. కానీ, విభజన సమయంలో కాంగ్రెస్ తప్పు చేసిందన్నారు.. ఇక, మంచి ఐడియల్ సమయం ఇది.. చంద్రబాబు టాక్టీస్ ఏ వ్యక్తికి ఎవ్వరికీ ఉండరు.. ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయన తలచుకుంటే విభజన సమస్యలు పరిష్కారం అవుతాదనే నమ్మకం నాకుంది.. దీనిపై పవన్ కు లేఖ కూడా రాశాను అని వెల్లడించారు.. విభజన హామీలో 75 వేల 50 కోట్లు రాష్ట్రానికి రావాలి.. దీనిపై పార్లమెంటులో ప్రస్తావించమని కోరాను అన్నారు ఉండవల్లి.. కేంద్రంతో పవన్ కల్యాణ్ మాట్లాడితే పరిష్కారం వుంటుందన్న ఆయన.. పవన్ కల్యాణ్ సాధిస్తారనే నమ్మకం ఉంది.. ఇందులో సాధించడానికి లోక్‌సభకు నోటీసు ఇవ్వాలి.. నోటీసు ఎలా ఇవ్వాలో కూడా లేఖలో పేర్కొన్నాను.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపై చర్చించదానికి సిద్ధం అని చాలా సార్లు చెప్పారు .. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటులో చర్చించే నిర్ణయం తీసుకోవాలి.. విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం చేసిన రోజు ఇదే.. 1 లక్ష 42 వేల 600 కోట్లు ఇంకా పంచలేదు. 42 శాతం వాటా తెలంగాణకు వెళ్తుందన్నారు.. ప్రభుత్వ రంగ సంస్థలు విభజించ లేదు.. ఎందుకో ఆశ పవన్ కల్యాణ్ మీద వుంది.. గతంలో విభజన హామీలు పై పవన్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీలో 2 గంటలు చర్చించాం.. పవన్ స్పందిస్తే దీని మీద సుప్రీం కోర్టు లో వున్న విభజన కేసులకు తాను తిరగడం తగ్గుతుందన్నారు.. ఇక, తాను పవన్ కల్యాణ్ గురించే మీడియా సమావేశం ఏర్పాటు చేశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్..
వల్లభనేని వంశీ కేసులో మరో కొత్త ట్విస్ట్..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. కేసులో కీలకంగా ఉన్న సత్యవర్థన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ నెల 11వ తేదీన వల్లభనేని వంశీ, సత్యవర్దన్ సహా ఐదుగురిపై FIR రిజిస్టర్ చేశారు పోలీసులు.. 84/2025 కేసులో ఏ5గా ఉన్నారు సత్యవర్థన్.. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీ, కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్ధన్ లపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.. 232, 351 (3), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పటమట పోలీసులు.. అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్.. తాజాగా వల్లభనేని వంశీ మోహన్ బ్యాచ్ బెదిరింపులకు లొంగి 5 లక్షలు తీసుకుని కేసు వాపస్ తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేశారు.. వంశీ బ్యాచ్ 5 లక్షలు కేసు వాపస్ తీసుకుంటే ఇస్తానని తమకు చెప్పారని.. టీడీపీ వాళ్లతో మాట్లాడి అంతకంటే ఎక్కువ ఇప్పించాలని తమను కోరినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు రమాదేవి.. పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్థన్ వినకుండా కేసు వాపస్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు.. వల్లభనేని వంశీ మోహన్ అతని అనుచరులు డబ్బులకు ప్రలోభ పెట్టి చంపుతామని సత్యవర్ధన్ ను బెదిరించారని కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు రమాదేవి.. ఇక, ఆమె ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీ, కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్ధన్ లపై కేసు నమోదు చేశారు పటమట పోలీసులు..
ప్రతిపక్షం లేదని లైట్‌గా తీసుకోవద్దు.. అసెంబ్లీ సమావేశాలపై సీఎం కీలక ఆదేశాలు..
సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతిపక్షాలు ఒక్కోసారి అప్పర్ హాండ్ లో ఉంటాయి.. అధికార పక్షానికి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సభ నడిపే విధానంలో ఆచి తూచి వ్యవహరించాలి.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో కూటమి బలం 164.. వైసీపీ ఎమ్మెల్యేలు 11.. అయిన కూడా సీఎం చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలను లైట్ గా తీసుకోవద్దు అంటున్నారు.. ఎమ్మెల్యేలు, మంత్రులు సబ్జెక్టు పై పట్టుతో అసెంబ్లీ సమావేశాలను నడపాలని సూచించారు. అసెంబ్లీ జరిగినపుడు ప్రతిపక్షం సాధారణంగా అడ్డు పడుతూ ఉంటుంది.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు. చర్చలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో.. కానీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రావడం లేదు.. బడ్జెట్ సమావేశాలకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.. అయితే, ఇక్కడే అలెర్ట్ అవుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీకి రాకపోయినా బయట వైసీపీకి మాట్లాడే అవకాశం ఉంది.. దీంతో, వైసీపీ కౌంటర్ లకు వెంటనే రెస్పాండ్ అవ్వాలని చెబుతున్నారు. ప్రస్తుతం.. ప్రభుత్వం ముందు సంక్షేమ పథకాలకు సంబంధించి సవాళ్లు ఉన్నాయి.. ఇప్పటి వరకు 8 నెలలు పూర్తి అయ్యాయి.. ఇప్పుడు కేవలం 2 పథకాలు మాత్రమే. అమలులో ఉన్నాయి.. మరి కొన్ని త్వరలోనే ప్రారంభం అంటున్నారు.. ఇది వైసీపీకి కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంది.. సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ విషయంలో కానీ.. అమరావతి విషయంలో కానీ.. తగిన సమాధానం చెప్పాలంటున్నారు… అయితే, వైసీపీ చేసే విమర్శలకు వెంటనే కౌంటర్ ఉండలంటున్నారు. ప్రభుత్వం 8 నెలల పాలనా తీరు.. తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షం అడగకపోయినా కూడా. చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని ఎమ్మెల్యేలు, మంత్రులకు చెబుతున్నారు సీఎం చంద్రబాబు..
విషాదం.. కేసు వాదిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన న్యాయవాది
గుండెపోటు మరణాలతో రోజు ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. చాలా మంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. రోజుకు కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోతున్న సంఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ వరుడు గుర్రంపై కూర్చుని ఉండగానే చనిపోయాడు.. అలాగే కొందరు డ్యాన్స్ చేస్తూ, సినిమా చేస్తూ, వాకింగ్ చేస్తూ.. ఇలా చాలా సందర్భాలలో గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టులో ఓ సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఓ కేసుకు సంబంధించి తన క్లైయింట్ తరుఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో లాయర్ వేణుగోపాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న తోటి లాయర్లు, కోర్టు సిబ్బంది హాస్పిటల్‌కు తరలించే లోపే మార్గమధ్యలో న్యాయవాది వేణుగోపాల్ రావు మృతి చెందాడు. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులో అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపి వేశారు జడ్జిలు. మరోవైపు.. అన్ని కోర్టులలో విచారణలు రేపటికి వాయిదా వేశారు న్యాయమూర్తులు.
రంజాన్ సందర్భంగా పటిష్ట చర్యలు.. అధికారులు సమన్వయంతో పని చేయాలి
మార్చి 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్ల పై డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా.. జీహెచ్ఎంసీ రంజాన్ నెలలో నగరంలో పరిశుభ్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. మసీదు, ఈద్గాల వద్ద ప్రత్యేక శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీధి దీపాలు మరమత్తులు, తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. అలాగే.. రోడ్ల మరమత్తులు పూర్తి చేస్తామని వెల్లడించారు. మక్కా మసీద్, రాయల్ మాస్క్, మిరాలం ఈద్గా వద్ద ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. రాత్రి సమయంలో దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ టీం ద్వారా ఫాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమించి సమన్వయం చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.
హామీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది..
మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలకు హామీ ఇచ్చింది.. హామీలను నెరవేర్చడం విఫలమైందని ఆరోపించారు. శాస్త్రీయ పద్దతిలో కులగణన చేయలేదు.. అబాసు పాలు అయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్.. 317 జీవోతో ఉద్యోగులకు మోసం చేశాడని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు విషయంలో కాంగ్రెస్ విఫలమైందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ పై ప్రజలకు విరక్తి రాలేదు.. కానీ 9 నెలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి వచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం.. ఎవ్వరు గెలిచినా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నాడని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. కులగణనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.. అందుకే రీసర్వే చేస్తున్నారని ఈటల ఆరోపించారు. టీచర్ల సమస్యలపై పోరాటం చేసే పార్టీ బీజేపీ అని ఈటల రాజేందర్ తెలిపారు. ఈ దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే.. ప్రపంచంలో దేశం ముందు ఉండాలి అంటే బీజేపీకి ఓటు వేయండని ఈటల రాజేందర్ కోరారు.
మహా కుంభమేళాపై సీఎం మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా ప్రసంగించారు. ఇటీవలి తొక్కిసలాట సంఘటనలను ఉటంకిస్తూ.. మహా కుంభ్‌ను ‘మృత్యు కుంభ్’ అన్నారు. ఈ కుంభమేళాలో వీఐపీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని.. పేదలు దానికి సౌకర్యాలు కరువయ్యాయన్నారు. మహాకుంభ మేళా ఇప్పుడు మృత్యు కుంభమేళాగా మారిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంత పెద్ద కార్యక్రమానికి ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు. తొక్కిసలాట సంఘటనలో మృతదేహాలను పోస్ట్ మార్టం చేయకుండానే బెంగాల్ కు తరలించారు. గుండెపోటుతో ప్రజలు చనిపోయారని, వారికి ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. మీరు దేశాన్ని విభజించడానికి మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. మరణ ధృవీకరణ పత్రాలు కూడా లేకుండా మృతదేహాలను పంపారు. మేము ఇక్కడే పోస్ట్‌మార్టం చేశాం. ఈ ప్రజలకు పరిహారం ఎవరు ఇవ్వాలి?” అని మమతా బెనర్జీ ప్రశ్నించారు.
ఇటాలియన్‌కు చెందిన 457 సీసీ స్పోర్ట్ బైక్ విడుదల.. ధర తక్కువే!
ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రిలియా భారతదేశంలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. కొత్త మోటార్‌సైకిల్ టువోనో 457ను అధికారికంగా విడుదల చేసింది. ఇది భారత మార్కెట్లో అత్యంత చౌకైన అప్రిలియా బైక్! దీని ప్రారంభ ధర రూ. 3.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. కొన్ని నెలల క్రితం, ఈ మోటార్ సైకిల్‌ను ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA మోటార్ షోలో ప్రదర్శించారు. ఇప్పుడు ఈ బైక్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇది స్పోర్ట్, నేకెడ్ బైక్ అని, యువత దీనిని చాలా ఇష్టపడుతుందని కంపెనీ చెబుతోంది. దీనిలో కొన్ని యాంత్రిక మార్పులు చేశారు. ఇది RS 457 నుంచి భిన్నంగా ఉంటుంది. ఈ బైక్ ప్రధానంగా దేశంలో KTM 390 డ్యూక్ అలాగే, యమహా MT-03తో పోటీ పడుతుంది. టువోనో ధర RS457 మోడల్‌తో పోలిస్తే రూ. 25,000 తక్కువ ధరలనే కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. అప్రిలియా టువోనో 457లో కంపెనీ 457 సీసీ సామర్థ్యం గల సమాంతర-జంట ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 47.6 హెచ్‌పీ శక్తిని, 43.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జత చేశారు. అప్రిలియా కంపెనీకి చెందిన ఇతర మోడళ్లకు ఇది భిన్నంగా ఉంటుంది. దీని లుక్ చాలా అద్భుతంగా ఉంది. ఈ బైక్ ట్యాంకులో 12.7 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఈ మోటార్ సైకిల్ బరువు 175 కిలోలు. ఎత్తు పల్లాలు, గుంతలు ఉన్న రోడ్లపై కూడా ఇది మెరుగ్గా దూసుకుపోతుంది. ఇది ఆప్ఫనల్ క్విక్‌షిఫ్టర్‌ను కూడా కలిగి ఉంటుంది. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ చాలా ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు రైడర్లకు అవసరమయ్యే ఫీచర్స్‌ను బైక్‌లో అందించింది.
ఒక్కరోజు లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒక్కరోజు లాభాలకు బ్రేక్ పడింది. గత ఎనిమిది రోజులుగా భారీ నష్టాలు చవిచూడగా సోమవారం కాస్త ఊరట లభించింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి నష్టాలను ఎదుర్కొంది. మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ 29 పాయింట్లు నష్టపోయి 75, 967 దగ్గర ముగియగా.. నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 22, 945 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 7 పైసలు తగ్గి 86.94 దగ్గర ముగిసింది. నిఫ్టీలో ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్ అత్యధికంగా నష్టపోగా.. టెక్ మహీంద్రా, విప్రో, ఒఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ లాభాలను ఆర్జించాయి.
సురేఖావాణి కూతురి హాట్ ట్రీట్ నెక్స్ట్ లెవల్
సుప్రీత పేరుకు పరిచయం అక్కర్లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి కూతురు.. ఇండస్ట్రీలోకి ఇంకా అడుగు పెట్టలేదు గాని బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. అయితే సోషల్ మీడియాలో ఒక రేంజ్ అందాల ఆరబోతతో రెచ్చిపోయిన ఆమె ఇప్పుడు కాస్త పద్ధతిగా మారి చీరకట్టులో కనిపిస్తోంది. అయితే ఆమె తాజాగా మరోసారి హాట్ ట్రీట్ తో విరుచుకు పడింది. నిజానికి తల్లి సురేఖా వాణి, కూతురు సుప్రీత ఇద్దరూ వెకేషన్స్‌కు వెళ్లి సందడి చేస్తుంటారు. ఎక్కువగా ఈ తల్లీకూతుళ్లు గోవాకు వెళ్లి చిల్ అవుతుంటారు. అయితే ఇపుడు వాలెంటైన్స్ డేకి మాత్రం ఈ ఇద్దరూ థాయ్ లాండ్‌లోని పుకెట్‌కు వెళ్లి చిల్ అయ్యారని సమాచారం. ఈ మేరకు సుప్రీత పోస్ట్ చేసిన ఫోటోలలో ఆమె అందాలు చూసి కుర్రకారు అంతా నోరు వెళ్ళబెట్టేలా ఉంది. సుప్రీత ఒక రేంజ్ లో తనదైన అందాల విందుతో నెట్టింట్లో మంటలు పెట్టింది. త్వరలో ఆమెహీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అమర్ దీప్‌తో కలిసి సుప్రీత ఓ సినిమా చేస్తోంది.
తెలుగు హీరోయిన్ల గురించి సరదాగా అన్నా.. వీడియో రిలీజ్ చేసిన ఎస్కేఎన్
తాజాగా జరిగిన ప్రదీప్ రంగనాధన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా హీరోయిన్ కాయాదు గురించి మాట్లాడుతూ తాము ఇతర బాషల హీరోయిన్లను ఇష్టపడతామని, తెలుగు వారికి అవకాశం ఇక ఇవ్వకూడదని అనుకుంటున్నామని అర్ధం వచ్చేలా మాట్లాడాడు. ఆ విషయం మీద వివాదం రేగింది. అసలు అలా ఎలా మాట్లాడతారు అంటూ కొంతమంది ఆయనని విమర్సిసితున్న క్రమంలో ఓ వీడియో రిలీజ్ చేశారు ఎస్కేఎన్. ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్దిమంది నిర్మాతలలో నేను ఒకడిని. రేష్మ, ఆనంది, ప్రియాంక జవాల్కర్, మానస, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, ఖుషిత అనే తెలుగు అమ్మాయిలను నేను నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశాను. అలాగే హారిక అనే అమ్మాయితో పాటు మరో తెలుగు అమ్మాయితో కూడా ఇప్పుడు పని చేస్తున్నా. అలాగే ఈషా రెబ్బా, ప్రియవడ్లమని, ఇనయ లాంటి అమ్మాయిలతో కూడా నేను వర్క్ చేశా. నేను పని చేసిన 80% మంది హీరోయిన్లు తెలుగు అమ్మాయిలే. నేనొక టార్గెట్ పెట్టుకున్నా, 25 మంది తెలుగు అమ్మాయిలను సినిమాలోని వివిధ రంగాల్లో నా ద్వారా అవకాశం కల్పించాలని. నేను సరదాగా మాట్లాడిన మాటని ఒక స్టేట్మెంట్ లాగా స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత మంది తెలుగు అమ్మాయిలను పరిచయం ఎవరూ చేయలేదు. సరదాగా అన్నాను, సరదాగా తీసుకోండి అని ఆయన చెప్పుకొచ్చారు
పుష్ప- 2 లేటెస్ట్ కలెక్షన్స్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా పుష్ప -2 అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కలెక్షన్స్ సునామి సృష్టిచింది. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 50 రోజుల థియేట్రికల్ రన్ కూడా కంప్లిట్ చేసుకుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బెంచ్ మార్క్ సెట్ చేసింది. విడుదలైన మొదటి 5 రోజుల్లోనే ఈ సినిమా రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అత్యంత వేగంగా ఈ ఫీట్ ను అందుకున్న సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఇక ఇటీవల ఈ సినిమా అర్ధశతదినోత్సవ వేడుకను పురస్కరించుకుని థాంక్స్ మీట్ కూడా నిర్వహించి యూనిట్ కు ప్రత్యేక షీల్డ్స్ కూడా ఇచ్చారు మేకర్స్. తాజాగా పుష్ప 2 కలెక్షన్స్ కు సంబంధించి మరొక పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణసంస్థ. విడుదల నాటి నుండి ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 1871 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని, ఇది పుష్ప రాజ్ బ్రాండ్ అని సింబాలిక్ గా తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డు అని పోస్టర్ లో పేర్కొన్నారు నిర్మాతలు. మరోవైపు 2024 లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మొదటి స్థానాన్ని అందుకుంది పుష్ప -2