Harish Rao- Uttam: ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ఈ ప్రభుత్వం నిరు పేదల గురించి ఆలోచించదా? అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బీఆర్ఎస్ విజయం అన్నారు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. అయితే, రోడ్ బుచ్చన్నతో దగ్గర లక్ష రూపాయల చిట్టీ వేసింది జంగం విజయ. అయితే, చిట్టీ గడువు ముగిసినా.. డబ్బులు చెల్లించడంలేకపోవడంతో అతడిపై డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. పైసల కోసం నా పరువు తీస్తుందేమో అనే కారణంతో బుచ్చన్న తన పాలేరు నగేష్తో కలిసి సదరు మహిళను హత్య చేసి పూడ్చి పెట్టారు.
Komuravelli Mallanna Jatara 2025: కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి జాతర ఈరోజు (జనవరి 19) నుంచి ప్రారంభం కానుంది. అయితే, సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగియనుంది.
తెలంగాణలో టీడీపీ పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నాం అని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ మరియు ఆశ ఉందన్నారు. తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యం అని లోకేశ్ చెప్పారు. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు.…
SSIA: తెలంగాణ పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు సింగపూర్లో సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ (SSIA)తో ప్రత్యేక రౌండ్ టేబుల్ చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో SSIA ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొని, తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బ్రియాన్ టాన్ (SSIA ఛైర్మన్), టాన్ యూ కాంగ్ SSIA వైస్ ఛైర్మన్, గ్లోబల్ ఫౌండ్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్), అప్లైడ్ మెటీరియల్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో…
Ration Card Verification : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరింత దృష్టిలో పెట్టుకుని, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నేతృత్వంలో 150 డివిజన్లలో దరఖాస్తుదారుల అర్హతల పరిశీలన ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో రేషన్ కార్డుల…
జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. తాము దీక్ష చేస్తేనే.. ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్ఎస్ ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా మోసాలపై ‘రైతు ధర్నా’…
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ.. సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) సంస్థతో ఎంఓయు కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ల సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఈరోజు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సింగపూర్ ఐటీఈ పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి…
జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని స్పష్టం చేశారు. అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుండి కొత్త కార్డులు ప్రభుత్వం ఇస్తుందని, ప్రతిపక్షాలు…