Minister Ponguleti: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు (జనవరి 23) ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి, హైదర్ సాయిపేట, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, పడమటి తండాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి ఏర్పడి వచ్చేనెల 11కు నాలుగేళ్లు పూర్తవుతుంది. 2021 ఫిబ్రవరి 11న మేయర్ గద్వాల విజయలక్ష్మిని డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత శోభన్ రెడ్డిని ఎన్నుకున్నారు అప్పుడు మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్స్. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మేయర్. దీన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీ అధిష్టానం సైతం అస్సలు జీర్ణించుకోలేకపోతోందట.
తెలంగాణ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులో ఆమె ప్రారంభించిన శిలాఫలకాల ధ్వంసం చర్చనీయాంశం అవుతోంది. మొన్న కొండాయి గ్రామంలో, నిన్న అబ్బాయిగూడెంలో వరుసగా సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలనే ధ్వసం చేశారు గుర్తు తెలియని దుండగులు. గిరిజనుల అవసరాలకు కోసం చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను పగలగొడుతున్నది స్వపక్ష నేతలా విపక్ష నాయకులా అన్నది హాట్ టాపిక్ అయ్యింది వరంగల్ పొలిటికల్ సర్కిల్స్లో.
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోలు ప్రైవేట్ సంస్థల పరిధిలోకి వెళ్లిపోతున్నాయనే దుష్ప్రచారం పూర్తి అవాస్తవమని పేర్కొంది.
రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. రైతు ఆత్మహత్యలు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలుపై చర్చించారు.
సత్తుపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును దగ్గర నుంచి గమనిస్తున్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు ఏమిటో నిన్నటి గ్రామసభలను చూస్తే తెలుస్తుందని అన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ సభల్లో ప్రభుత్వాన్ని గ్యారంటీలపై నిలదీస్తున్నారని తెలిపారు.
Uttam Kumar Reddy: చొప్పదండి నియోజకవర్గం నారాయణపూర్ గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ఆయన, ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రూ. 80 కోట్లు ఖర్చు చేసి, నీటిని ఆయకట్టుకు అందజేయాలని ప్రభుత్వ ప్రణాళిక ఉందన్నారు.…
CtrlS AI Data Center: తెలంగాణలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ క్లస్టర్ను నెలకొల్పేందుకు కంట్రోల్ఎస్ (CtrlS) డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రస్తుతం దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా కుదిరింది. ఈ ప్రాజెక్టుకు కంట్రోల్ఎస్ సంస్థ రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ను తెలంగాణలో నెలకొల్పే ప్రణాళికను రూపొందించింది.…