యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధం అవుతుంది.. రేపటి నుండి (బుధవారం) 23వ తేదీ వరకు పంచకుండాత్మక నృసింహ మహా యాగం జరిపించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేయనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీ మధుర కవి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ క్రతువును నిర్వహించనున్నారు. ఈ వేడుకకు వచ్చే అతిధులు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆధ్యాత్మికత వెళ్లి విరిసేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహా కుంభాభిషేక సంరక్షణ మహోత్సవం సందర్భంగా పంచకుండాత్మక హోమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రధాన ఆలయ ఉత్తరం మాడ వీధిలో పర్ణశాల ఏర్పాటు చేశారు.
Read Also: Medak: ఇలా తయారవుతున్నారేంటీ.. భర్తకు వైద్యం చేయించలేక హత్య చేసిన భార్య
మరోవైపు.. వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, నారాయణ, అనిరుద్ధ, అనే దేవతామూర్తుల పేర్లతో ఐదు కుండాలు సిద్ధం చేశారు. పంచ కుండాల చెంత విశేష హోమాది పూజలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో 108 మంది రుత్వికులతో నృసింహ మూల, మూర్తి మంత్రం, రామాయణ, మహా భారత, ఇతిహాసాల పఠనం చేయనున్నారు. మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం నేపథ్యంలో.. సోమవారం రోజున కోయిల్ తిరుమంజనం నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖ మండపం, ప్రధాన ప్రాకార మండపాలను సోమవారం దేవస్థానం సిబ్బంది శుద్ధి చేశారు. ప్రధాన ఆలయం ఉప ఆలయాలతో పాటు యాదగిరి కొండ చుట్టూ చలవ పందిరిలు, రాత్రి వేళలో ఆకర్షనీయంగా ఉండేలా విద్యుత్ కాంతులు విరజిమ్మె లైట్లు ఏర్పాటు చేశారు.
Read Also: Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ సైన్యంలో మూడో వంతు ముస్లింలే.. నమ్మశక్యంకాని నిజాలు!
వీటితోపాటు యాదగిరిగుట్ట కొండ పైన జరిగే పూజా కార్యక్రమాల వివరాలు వేద పండితుల మంత్రోచ్ఛారణలు భక్తులు యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు వినిపించేలా మైక్ లు, కనిపించేలా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా నిర్వహించే పంచకుండాత్మక యాగానికి పలువురు దాతలు సమిధలు అందజేశారు.