Hyderabad: అత్తాపూర్‌లో హైడ్రా ఉక్కుపాదం.. రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నగరంలో అక్రమ కబ్జాలపై ‘హైడ్రా’ (HYDRAA) తన ఉక్కుపాదం కొనసాగిస్తోంది. తాజాగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయం సమీపంలో అక్రమంగా కబ్జాకు గురైన భారీ ప్రభుత్వ స్థలాన్ని అధికారులు శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్ సర్వే నంబర్లు 354/1, 354/2, 354/3, 354/4 లో ఉన్న సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని పది రోజుల క్రితం ఒక వర్గానికి చెందిన వ్యక్తులు అక్రమంగా ఆక్రమించే ప్రయత్నం చేశారు. రాత్రికి రాత్రే అక్కడ బ్లూ షీట్లు (Blue Sheets) ఏర్పాటు చేసి, కంచె వేసి కబ్జాకు పాల్పడ్డారు. స్థానికుల నుంచి అందిన సమాచారంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు, రెవెన్యూ విభాగంతో కలిసి నేడు ఉదయాన్నే ఆపరేషన్ ప్రారంభించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత ప్రారంభించారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 200 మంది పోలీసు బలగాల మధ్య ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగింది. కబ్జాదారులు ఏర్పాటు చేసిన బ్లూ షీట్లను, తాత్కాలిక నిర్మాణాలను జేసీబీలతో నేలమట్టం చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం స్వాధీనం చేసుకున్న ఈ రెండు ఎకరాల భూమి విలువ 100 కోట్ల రూపాయల పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని అధికారులు ఈ
సందర్భంగా హెచ్చరించారు.
READ MORE: Telangana Weather Update: మండే ఎండల మధ్య చల్లటి కబురు.. తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు..
Also Read
- Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
తాజావార్తలు
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!