Flood Relief Fund: గత ఏడాది సంభవించిన విపత్తులు, వరదలకు సంబంధించిన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు (ఫిబ్రవరి 19) ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాతో పాటు నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో సంభవించిన విపత్తులకుగానూ మోడీ సర్కార్ ఆయా రాష్ట్రాలకు విపత్తు సాయంపై అందజేసింది. ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదలు రావడంతో పాటు కొండ చరియలు విరిగి పడటం లాంటి ప్రకృతి విపత్తులు జరిగిన మిగితా మూడు రాష్ట్రాలకు కలిపి నిధులు రిలీజ్ చేసింది.
Read Also: KCR: పాస్పోర్ట్ ఆఫీస్లో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్
తాజాగా, కేంద్ర ప్రభుత్వం అదనంగా కేటాయించిన మొత్తం నిధులు రూ. 1554.99 కోట్లలో ఏపీకి రూ. 608.08 కోట్లు, తెలంగాణకు రూ. 231. 75 కోట్లు.. త్రిపురకు రూ. 288.93 కోట్లు, ఒడిశాకు రూ. 255.24 కోట్లు, నాగాలాండ్ కు 170. 99 కోట్ల రూపాయలను విడుదలకు నిర్ణయం తీసుకుంది. కాగా, గతేడాది వరదలు, విపత్తు కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఇప్పటికే కొన్ని నిధులు విడుదల చేయగా.. నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించి నివేదికలు ఇచ్చిన మరో ఐదు రాష్ట్రాలకు అదనంగా నిధులను కేటాయించింది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కార్ SDRFలో భాగంగా 27 రాష్ట్రాలకు రూ. 18,322.80 కోట్లు విడుదల చేయగా.. NDRF కింద 18 రాష్ట్రాలకు రూ. 4,808.30 కోట్లు రిలీజ్ చేసింది.