Harish Rao: మంచిర్యాల జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ డబ్బులను ఇంటి పన్నులో జమ చేశారు అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషం అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పారు.
Afzalgunj firing: హైదరాబాద్ లోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దుండగులు వాడిన టూ వీలర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. మహాత్మా గాంధీ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని హస్తగతం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలో టూ వీలర్ చోరీ చేసిన దుండగులు.. ఆ వాహనంలోనే బీదర్ వరకు వెళ్లి దోపిడి చేసినట్లు గుర్తించారు.
Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 15వ వార్డులో ప్రజా పాలన వార్డు సభను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదు..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా మహేష్ గౌడ్‌ను గత సెప్టెంబర్‌లో నియమించింది పార్టీ అధిష్టానం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు... అంతా ఏక్ నిరంజన్ అన్నట్టుగానే ఉంది తప్ప... కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ... ఇన్ని రోజుల పాటు పీసీసీ కార్యవర్గాన్ని నియమించకుండా ఉండలేదన్న చర్చ జరుగుతోంది గాంధీభవన్ వర్గాల్లో. గతంలో రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించిన సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు , ప్రధాన కార్యదర్శులు, ప్రచార…
ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో నకిలీ జడ్జిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని వద్ద సకిలీ జడ్జి ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ రకాల చిరునామాలతో అతని దగ్గర కార్డులు ఉండడాన్ని గుర్తించారు పోలీసులు..
Wipro: విప్రో కంపెనీ హైదరాబాద్ లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పతుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
Kaleshwaram Commission: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణలో స్పీడ్ పెంచింది. ఎంక్వైరీలో భాగంగా ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, అధికారులను కమిషన్ క్వశ్చన్ చేసింది. ఈ క్రమంలోనే ఈరోజు (జనవరి 23) కమిషన్ ఎదట కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు చేపట్టిన ఏజెన్సీ సంస్థల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు.