అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, రబీ పంటలు, రైతు భరోసా రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై సమీక్ష చేశారు. వ్యవసాయం, గృహ, పారిశ్రామిక రంగాలలో వేసవిలో సరఫరాకు డిమాండ్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ లభ్యత తగినంత పరిమాణంలో ఉందని సీఎస్ కలెక్టర్లకు తెలిపారు. ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ అధికారులతో పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు. సరఫరాను ఫీడర్ వారీగా పర్యవేక్షించాలని.. తాగునీటి సరఫరా, ఆసుపత్రులలో విద్యుత్ సరఫరా వంటి కీలకమైన మౌలిక సదుపాయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు వివరించారు. కలెక్టర్లు సబ్‌స్టేషన్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: DK Aruna: సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడని అనుకుంటున్నారు..
మరోవైపు.. రిజర్వాయర్లలో గత సంవత్సరం కంటే నీరు చాలా ఎక్కువగా ఉందని సీఎస్ తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేని జిల్లాల్లో త్వరలో కొత్త రేషన్ కార్డులు ప్రారంభమవుతాయని కలెక్టర్లకు చెప్పారు. వేసవి ప్రారంభంలో ఉన్నందున.. గరిష్ట డిమాండ్ గత సంవత్సరం డిమాండ్‌ను మించిపోయిందన్నారు. అందుకోసం నిరంతర విద్యుత్ సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించడానికి కాల్ సెంటర్ నంబర్ 1912 గురించి కలెక్టర్లు ప్రచారం చేయాలని సీఎస్ శాంతికుమారి తెలిపారు.
Read Also: Delhi : అది తప్పుడు ప్రచారం.. న్యూఢిల్లీ తొక్కిసలాట ఘటనపై స్పందించి రైల్వే శాఖ