Electric Shock: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తుండగా 13 మంది విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో లింగ ప్రసాద్ (23) అనే యువకుడు మృతి చెందాడు. అలాగే ఈ ఘటనలో మరో యువకుడు వడ్డే కర్ణాకర్ (25) పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కర్ణాకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
Read Also: Komatireddy Venkat Reddy: ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ
ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. శివాజీ జయంతి వేడుకల సందర్భంగా జరిగిన ఈ ప్రమాదంపై గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ భద్రతా చర్యలపై మరింత అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులు, నేతలు సూచించారు.