టీడీపీలో ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతిపాదనకు పార్టీ పొలిట్ బ్యూరో ఆమోద ముద్ర వేసింది. మూడుసార్లు, ఆరేళ్లుగా పదవిలో ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు.
ట్రబుల్ షూటర్.... ఈ మాట వినగానే..... కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చే పేరు హరీష్‌రావు. ఉద్యమ సమయంలో... కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరింది బీఆర్ఎస్. అప్పుడు ఎమ్మెల్యేగా కూడా లేని హరీష్‌రావుని మంత్రిని చేశారు కేసీఆర్. అలాగే హరీష్ కూడా మామకు నమ్మిన బంటు అనడంలో ఆశ్చర్యం లేదంటారు పొలిటికల్ పండిట్స్.
Anugula Rakesh Reddy : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఉన్న పేద ప్రజల షాపులను కూల్చివేయడం గమనార్హం. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతాల పేదలకు చెందిన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఈ చర్యకు సంబంధించిన వివిధ ప్రశ్నలు ప్రజల్లో , రాజకీయ వర్గాల్లో చర్చించబడుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ..”అందగత్తెల కోసం పేదల షాపులను కూల్చడం ఏమిటి?” అని ప్రశ్నించారు. ఆయన అభిప్రాయానికి, అందగత్తెలతో రాష్ట్రానికి…
RTI Commissioners: తెలంగాణ రాష్ట్రంలో సమాచారం హక్కు చట్టం (RTI) అమలుకు సంబంధించి కీలక పాత్ర పోషించే సమాచార కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. పీవీ శ్రీనివాసరావు, మోసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్ లను రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించారు. వీరు తలపట్టిన ఈ పదవి మూడేళ్ల కాలానికి…
మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీరు ఉన్నట్టుండి మారిపోయింది. ఎంతటి సీరియస్ విషయాన్నయినా కూల్‌గా డీల్ చేసి తనదైన శైలిలో సాఫ్ట్ ముగింపు ఇచ్చే ఈటల భాష ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. తన సహజత్వానికి భిన్నంగా ఆయన చేస్తున్న ఎగ్రెసివ్ కామెంట్స్ నాలుగైదు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం అవుతోంది.
సంగారెడ్డి జిల్లా బీజేపీ ఇటీవల కొత్త మండల అధ్యక్షుల్ని ప్రకటించింది. ఇక అంతే... ఆ ఒక్క ప్రకటనతో.... జిల్లా పార్టీలో వర్గపోరు భగ్గుమంది. తమను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటంటూ.. పార్టీ ముఖ్య నాయకులు జిల్లా అధ్యక్షురాలిపై సీరియస్ అయినట్టు సమాచారం.