Minister Seethakka: ఎన్టీవీతో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కమిషన్లతో నడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది అని ఆరోపించింది. కేటీఆర్ కు అధికారం పోయాక పిచ్చోడు అయిపోయాడు అంటూ మండిపడింది. చెల్లి రేపో మాపో రాజీనామా చేస్తదని తెలుస్తుంది అన్నారు.
Ponguleti Srinivasa Reddy: నిర్మల్ జిల్లాలోని కుంటాల సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భూములు ఉన్నవారికి రక్షణ కల్పించడమే భూ భారతి లక్ష్యం అన్నారు. నాలుగు పైలెట్ మండలాల్లో 13 వేల అప్లికేషన్లు వచ్చాయి.. సాధ్యమైనంత వరకు సమస్యలు అన్ని పరిష్కరిస్తాం.. ధరణి వల్ల ఇబ్బంది పడ్డారో అలాంటి సమస్య భూ భారతిలో ఉండదు.
KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు హరీష్ రావుతో సమావేశం అయినట్లు తెలుస్తుంది.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది అన్నారు. విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.. రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్ పోర్టులకు విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి అన్నారు.
Inter Supplementary : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ జనరల్ కోర్సులో 2,49,032 మంది, ఒకేషనల్ కోర్సులో 16,994 మంది ఉన్నారు. రెండవ సంవత్సరం జనరల్ కోర్సుకు 1,34,341 మంది, ఒకేషనల్ పరీక్షలకు 12,357 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. గత నెల (ఏప్రిల్ 22) విడుదలైన ఇంటర్ ఫలితాల్లో…
2025-26 Academic: తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వార్షిక ఫీజుల పెంపుపై స్పష్టత ఇంకా రాలేదు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడు సంవత్సరాల పాటు ఫీజులను నిర్ణయించేందుకు టీఏఎఫ్ఆర్సీ (తెలంగాణ అడ్మిషన్లు & ఫీజులు నియంత్రణ కమిటీ) అనేక సార్లు సమావేశమైనా, ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రైవేట్ కాలేజీలు ఆడిట్ నివేదికలను తమ అనుకూలంగా రూపొందించారని ఆరోపణల నేపథ్యంలో, విద్యాశాఖ , ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించాయి. అయితే ఫీజుల…
Weather Update : అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ వాయు చక్రవాత ప్రభావంతో, నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, నేటి , రేపు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో…
Saraswati Pushkaralu : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. ఇక్కడ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొదటి రోజు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరంలో కుంభమేళాను తలపించేలా టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించడానికి ప్రత్యేక…
తెలంగాణ ఉద్యమ సమయంలోను, ఆ తర్వాత అధికారంలో ఉన్న పదేళ్ళు తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది బీఆర్ఎస్. కానీ... 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డాయి పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పాటు... తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలామంది నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వదిలేసి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అలాంటి వలసలు ఉక్కిరిబిక్కిరి చేసినా... ఈ మధ్య కాలంలో ఆ…
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తన సహజ శైలికి భిన్నంగా వీధి భాష వాడుతున్నారన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. తన నియోజక వర్గంలోని ఒక ప్రాంతంలో ప్రజలకి స్థానిక తహశీల్దార్ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు ఎంపీ. ఆ టైంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ... నోరు జారారు. సీఎంని అనకూడని మాట అనేయడంతో... ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈటల ఇంటి ముట్టడికి కూడా పిలుపునిచ్చింది అధికార పార్టీ.