ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16న వ్యవసాయ యూనివర్సిటీలో ‘రైతు నేస్తం’ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని రైతు నేస్తం కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan: భార్య తప్పుడు కట్నం ఆరోపణలు.. అత్తింటి ముందే ‘‘టీ’’ స్టాల్ పెట్టి భర్త నిరసన ..
రైతు నేస్తం కేంద్రాల్లోంచి అన్నదాతలతో రేవంత్‌రెడ్డి ముచ్చటించనున్నారు. ప్రతి ప్రాంతం నుంచి కనీసం 250 మంది రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎస్.. కలెక్టర్లకు ఆదేశించారు. దీంతో కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: OGకి వీరమల్లు దెబ్బ.. లేదంటేనా?
ఈ ఏడాది దేశంలోకి ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. ప్రస్తుతం తెలంగాణలో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంటలకు సంబంధించి రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. ఏఏ పంటలు వేయాలి.. ఎలాంటి ఎరువులు వాడాలి? తదితర అంశాలపై ముచ్చటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ నెల 16న రైతులతో ముఖ్యమంత్రి గారు ముఖాముఖి.
16న వ్యవసాయ యూనివర్సిటీలో జరగనున్న 'రైతు నేస్తం'
కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి గారు.ఈ ముఖాముఖిని అన్ని రైతు నేస్తం కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం.
ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశం.
ప్రతి… pic.twitter.com/PinZRwqsGa
— Telangana Congress (@INCTelangana) June 14, 2025