జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో స్కిల్ డెలప్మెంట్ కు సంబంధించి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివరించారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ కు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. రేపు కౌశల్ మందన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి.