Telangana Inter Supply Results : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం. రాష్ట్ర ఇంటర్‌బోర్డు (TSBIE) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు తుది తేదీని ప్రకటించింది. బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించిన ప్రకారం, ఈ నెల 16వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు.
Kajol : ఫోటోగ్రాఫర్లు.. మమల్ని అక్కడ కూడా వదలడంలేదు
ఇంతకు ముందు మే 22 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఫెయిలైన విద్యార్థులతోపాటు తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకున్న వారు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఇప్పుడు వారి దృష్టంతా ఫలితాలపై ఉంది. ఇటీవల జోసా కౌన్సెలింగ్, ఈఏపీసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలలో ఇంటర్ మార్కుల ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో ఫలితాలపై విద్యార్థులు తీవ్ర ఆతృతతో ఎదురు చూస్తున్నారు.