తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిపై కేసు నమోదు కాగా సిట్ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ట్యాప్ చేసిన నెంబర్లలో తన నెంబర్ ఉండడంతో కొంత సమాచారం కావాలని సిట్ కోరడంతో సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ కు తన స్టేట్ మెంట్ ను ఇచ్చాడు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డితో పాటు నా ఫోన్ కూడా ట్యాప్ చేసి మా మూమెంట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు. ఇదే ఫిర్యాదును గతంలో చేశాను.. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయని తెలిపారు.
Also Read:Pooja Hegde : పాత పరిచయాలతో, మళ్లీ టై అప్ అవుతున్న పూజా హెగ్డే ?
చట్టానికి వ్యతిరేకంగా అనేకమంది ఫోన్లు టాప్ చేశారు.. ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతల ఫోన్లో ట్యాప్ చేయడం హేయమైన చర్య.. ఇలాంటి చర్యకు పాల్పడ్డ నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. మేము మాత్రమే శాశ్వతంగా అధికారంలో ఉండాలి అనే చెడు ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. 2018లో మేము ఓడిపోవడానికి కారణం కూడా మా నాయకుల ఫోన్స్ ట్యాప్ చేయడం వాళ్లే అని అర్థమైంది అని అన్నారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయన్నారు.
Also Read:Hyderabad: డిఫెన్స్ మద్యం పట్టివేత.. ఎక్స్ ఆర్మీ పర్సన్ అరెస్ట్!
సిట్ దర్యాప్తులో 650 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు జాబితాలో ఉన్నాయి.. అనిల్ కుమార్ యాదవ్, అనిల్ తోపాటు అనేకమంది ఫోన్లు టాప్ అయినట్లు బయటికి వస్తుంది.. నాడు ఏరకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి దుశ్చర్యకు పాల్పడ్డారో అర్థం అవుతుంది. ప్రజాస్వామ్యంలో నిక్కచ్చిగా పనిచేయాల్సినటువంటి అధికారులు… ఏ రకంగా రాజకీయ నాయకుల కు తలొగ్గి అడుగులకు మడుగులు ఒత్తారో అర్థమవుతుందన్నారు. ప్రైవసీ అనేది మా ప్రాథమిక హక్కు.. దానిని కాలరాశారు.. రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావును దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టి దుశ్చర్యకు పాల్పడడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు.
Also Read:Iran-Israel War: ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఖమేనీ అత్యంత సన్నిహితుడు మృతి
నా పూర్తి పేరు పెట్టకుండా నక్సలైట్లకు సింపతైజర్లుగా ఉన్నారని ట్యాప్ చేయడం సిగ్గుచేటు.. కేటీఆర్ సిగ్గుతో తల దించుకోవాలి.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేయడం దుర్మార్గమైన చర్య.. ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేశారు దానికి మీరు శిక్షార్హులు. భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. ఇలాంటి దిగజారుడు పనికి ఒడిగట్టిన ఐఏఎస్ ఐపిఎస్ అధికారులకు కూడా శిక్ష పడాలన్నారు.
సజావుగా విచారణ జరిపి… రాజకీయ నాయకులైన, అధికారులైన… కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.. దేశ చరిత్రలో ఇంతటి హేయమైన చర్యకు పాల్పడడం ఇదే ప్రథమం.. కెసిఆర్ కేటీఆర్ లు రాజకీయ అవసరాల కోసం రాజకీయ నాయకులు, వ్యక్తులు, విలేకరులు, అధికారులు, న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం హేయమైన చర్య.. టిడిపి బిజెపి నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు.. మా పార్టీని నాశనం చేసేందుకు నా కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
Puri Jagannadh : తమిళ ‘బెగ్గర్’తో మలయాళ కుట్టి రొమాన్స్
నా పేరు కూడా పూర్తిగా మెన్షన్ చేయకుండా నా ఫోన్ ట్యాపింగ్ లో ఉందని పోలీసులు చెప్పారు.. మావోయిస్టులకు సహకరిస్తున్నారని ఉద్దేశంతో ఫోన్ ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావు చెప్పాడట.. ప్రభాకర్ రావు నాటి సిఎస్ ఇద్దరు కలిసి ఎన్నికల ముందు రెండు సంవత్సరాలు ఫోన్ ట్యాప్ చేశారు. ఆ హార్డ్ డిస్క్‌లను కూడా ధ్వంసం చేశారు.. ఆనాడు ఆకస్మాత్తుగా మా కార్లు ఆపేవారు.. ఆపి తనిఖీలు చేసేవారు.. అనుక్షణం పోలీసులు మమ్మల్ని నీడలా వెంటాడేవారు.. అకారణంగా అనేకసార్లు గృహనిర్బంధాలు చేశారు అని తెలిపారు.