CM Revanth Reddy: రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు దొరికిన చోటల్లా అప్పులు చేశాడని ఆరోపించారు. అందినకాడల్లా ఎగబెట్టి పోయాడు అని మండిపడ్డారు. మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని చెప్పారు.
Read Also: The Rajasaab : టీజర్ లో ఆ లుక్ లేదు.. కారణం అదేనా..?
ఇక, 18 నెలల్లో లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మాది సీఎం రేవంత్ అన్నారు. గ్రామాల్లో చర్చకు పెట్టండి.. ధరణి దోపిడి చేస్తే.. భూ భారతీ రైతులకు చుట్టం లెక్క మారింది.. కొత్తగా పిల్లగాడు సీఎం అయ్యిండు.. సమయం ఇద్దామని కూడా లేదు.. ఎప్పుడూ పడగోడదమా అని ఆలోచనే.. మేము ఎప్పుడూ జనం మధ్యలోనే ఉన్నాం.. మేము ఏమైనా ఫామ్ హౌస్ లో ఉన్నామా అని ప్రశ్నించారు. గత సీఎం ఎన్ని సార్లు జనంలోకి వచ్చారో ఆలోచించండి అన్నారు. అయితే, గత పదేళ్లలో భార్య భర్తలు మాట్లాడినా వినే వాళ్ళు అని ఆరోపించారు. మేము వచ్చాకా మీరు స్వేచ్ఛగా మాట్లాడటం లేదా..? అని అడిగారు. మమ్మల్ని ఏదైనా అంటే.. స్వేచ్ఛగా అంటలేరా.. మా ప్రభుత్వంలో నలుగురు దళితులు మంత్రులు అయ్యారు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏక లింగం ఉండేది అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు.
Read Also: Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్..!
అయితే, ప్రతీ శాఖను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. తప్పులు ఉంటే సరిదిద్దుకుంటున్నాం.. వచ్చే 9 రోజుల్లో పెట్టుబడి సాయం అందజేస్తాం.. వ్యవసాయ పని ముట్లు రైతులకు ఇస్తామని వెల్లడించారు. కమర్షియల్ క్రాఫ్ వేయండి అని సూచించారు. కుటుంబంలో ఒకరు వ్యవసాయం.. ఇంకొకరు ఉద్యోగం, ఇంకొకరు వ్యాపారం చేయండి అన్నారు. సోలార్ విద్యుత్ వైపు దృష్టి పెట్టండి.. దానికి పెట్టుబడి మేము పెడతాం.. రైతులు వాడుకుని మిగిలిన విద్యుత్ అమ్ముకుంటారు.. రైతులకు సోలార్ పవర్ మీద అవగాహన పెంచండి అని సీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.