మెదక్ లో కామారెడ్డి డిక్లరేషన్ సాధన కోసం బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. UPF, తెలంగాణ జాగృతి బీసీల కోసం పోరాడుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు. మెదక్ లో బీసీల సమావేశం పెడితే కొందరు బెదిరిస్తున్నారని తెలిసింది.. ఇది రాజకీయ వేదిక కాదు.. బీసీల హక్కుల కోసం మేం పోరాడుతున్నామని వెల్లడించారు.
Also Read:Mahesh Kumar Goud: మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం
సరైన సమయంలో జాగృతి, UPF మాట్లాడింది కాబట్టి అసెంబ్లీలో రెండు బిల్లులు పెట్టారు.. బీసీ బిల్లును ఢిల్లీకి పంపించి కాంగ్రెస్ నేతలు చేతులు దులుపుకున్నారు.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీసీ బిల్లు గురించి ఒక్కరోజైనా మాట్లాడారా..? బీసీ బిల్లుకు బిజెపి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కులగణనలో బీసీల జనాభా తక్కువ చేసి చూపించారు.. మీరు చిత్తశుద్దిగా కుల గణన చేస్తే ప్రతి గ్రామంలో లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Also Read:Ashu Reddy : అషురెడ్డి అందాల విందు.. చూసేందుకు భలే కనివిందు
జులై 17న రాష్ట్రవ్యాప్తంగా రైల్ రోకో చేస్తామని హెచ్చరించారు. బీసీ బిల్లు కోసం అన్ని సంఘాలను కలుపుకొని కార్యక్రమం చేస్తామన్నారు. ఢిల్లీలో కూర్చున్న నాయకులకు దక్కన్ పీఠభూమి శక్తి ఏంటో తెలియాలి.. బీసీ బిల్లు వచ్చే లోపు కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలని ప్లాన్ చేస్తుంది.. బిసిలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీకి సెగ తగిలేలా చేస్తామని హెచ్చరించారు.