ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయనికి సీఎం చంద్రబాబు.. కొన్ని కీలక శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష
ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నారా లోకేష్.. ఇవాళ, రేపు ఢిల్లీలోనే ఉండనున్న లోకేష్
ఆపరేషన్ సింధూర్‌లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కుటుంబానికి రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల రూపాయల చెక్కును నేడు అందజేయనున్న రాష్ట్ర మంత్రి సవిత
నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు.. వివిధ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో మురుగనీటి శుద్ధి కేంద్రాలు, వాటర్ షెడ్ ప్రాజెక్టులు పరిశీలించనున్న సభ్యులు
లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను నేడు కోర్టులో హాజరుపరచనున్న జైలు అధికారులు.. నేటితో రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో
ఏడుగురు నిందితులను కోర్టులో హాజరుపరచనున్న అధికారులు
లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు రాజ్ కేసీ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టు విచారణ.. లిక్కర్ స్కామ్ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసీ రెడ్డి
నేడు మరోసారి సిట్ విచారణకు హాజరుకానున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం 11 గంటలకు మొదటి సాక్షిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్న సిట్
నేడు భూపాలపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్‌లో విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించనున్న భట్టి.. మంజూరునగర్, ధర్మారావుపేట, నవాబుపేటల్లో సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న డిప్యూటీ సీఎం భట్టి
నేడు మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన.. బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న కవిత
నేడు సంగారెడ్డి జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పర్యటన.. మధ్యాహ్నం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
నేడు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం.. గాలె ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉదయం 11 గంటలకు మ్యాచ్ ఆరంభం