CM Revanth Reddy: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. 9 రోజుల్లోనే రైతులందరి అకౌంట్లలోకి రైతు భరోసా నగదు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక, రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును.. వ్యవసాయాన్నీ పండగ చేయాలనేది మా ఆలోచన అన్నారు. రైతుల ఆశీర్వాదం లేకుంటే.. అధికార పీఠం మీద కూర్చోలేరు అని తేల్చి చెప్పారు. శాసన సభ అయిన.. వార్డు మెంబరుగా గెలవాలన్నా రైతుల మద్దతు అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్..!
అయితే, తెలంగాణలో పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు.. ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు అని సీఎం రేవంత్ మండిపడ్డారు. రైతుల పేరుతో వీధి నాటకాలాడుతున్నారు.. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని నాలుగు విడతలు చేశారు.. అప్పు కంటే వడ్డీ ఎక్కువైంది అని ఆరోపించారు. రెండో సారి అధికారంలోకి వచ్చి.. కూడా రైతులను మోసమే చేశారు.. మా ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశాం అని పేర్కొన్నారు. పదేళ్లు ఆర్థిక విధ్వంసం చేసినా.. మేము ధైర్యంగా పని చేస్తున్నాన్నారు. ఇక, మేము సత్రం నడపడం లేదు.. వరి కొనమని గతంలో కేసీఆర్ చెప్పాడు.. రూ. 7 వేల కోట్లు నష్టం వచ్చింది కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయం అని చెప్పాడు.. అవన్నీ మర్చిపోయామా?.. కానీ, మేము ముందుకు వచ్చి కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
Read Also: Mega-Anil Movie : మెగా-అనిల్ మూవీలో రేపటి నుంచే నయన్ జాయిన్..
ఇక, సన్నబియ్యం పేదలకు ఇద్దాం అని చెప్పి.. సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మీరు పండించిన 60 శాతం వడ్లు కొన్నాం.. రైతులు పండించిన సన్న వడ్లతో పేదల అందరూ సన్న బియ్యం తింటున్నారు.. మీకు బోనస్ ఇచ్చి ధైర్యంగా కొన్నామని పేర్కొన్నారు. అయితే, సర్పంచ్ పెండింగ్ బిల్లుల ఇవ్వలేనిది కేసీఆర్.. నేను వచ్చే నాటికి సర్పంచులు లేరు అన్నారు. 8 లక్షల 29 కోట్లు అప్పు తెచ్చాడు కేసీఆర్.. ఇన్ని అప్పులు చేసి.. రోడ్లెక్కి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. గత ప్రభుత్వం వాయిదా పద్దతిలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే వాళ్ళు.. నేను వచ్చాకా మొదటి తేదీ జీతాలు వేస్తున్నాను అని సీఎం వెల్లడించారు.