ఆరు మందిని హత్య చేసాడు 60 ఏళ్ల కిష్టప్ప. ఈనెల 26న అమృతమ్మ అనే మహిళ హత్య జరిగింది. ఆ మహిళ హత్యకేసును చేధించారు వికారాబాద్ పోలీసులు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు వికారాబాద్. డి.ఎస్.పి సంజీవ్ రావ్. అమృతమ్మతో కలిపి మొత్తం ఆరు మందిని చేసాడు నిందితుడు అల్లిపూర్ కిష్టప్ప. 1985 నుండి 2021 వరకు ఆరు మందిని చేసాడు. కిష్టప్ప పై 1985 లొనే రౌడీషిట్ ఓపెన్ చేసారు పోలీసులు. వికారాబాద్ జిల్లాలో…
హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది.. అయితే, ఈ హత్యపై అనేక ఆరోపణలు ఉన్నాయి.. ఈ కేసులో ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వామన్‌రావు దంపతుల హత్య ముమ్మాటికే ప్రభుత్వ హత్యగానే విమర్శించారు.. సుప్రీంకోర్టులో వామన్‌రావుపై తెలంగాణ ప్రభుత్వమే కేసు వేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు శ్రవణ్.. ఇక, ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదని కేటీఆర్ ఒప్పుకున్నారు.. ఉద్యోగాలు…
బీజేపీ నేతలకు సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించిన ఆయన.. తెలంగాణలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పట్టించుకోలేదు.. అందుకే ఐటీఐఆర్ రద్దు అంటున్నారు.. మరి బెంగుళూరులో ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. 2014 నుండి మేం కేంద్ర మంత్రులను కలుస్తున్నామన్న ఆయన.. అనేక సార్లు లేఖలు ఇచ్చామని గుర్తు చేసుకున్నారు.. మేం చెప్పేదంట్లో తప్పు ఉంటే చెప్పండి ఎక్కడికి అయినా వచ్చి మాట్లాడటానికి…
ఇక నుంచి మనం టెన్షన్ పడడం కాదు.. సీఎం కేసీఆర్‌కు టెన్షన్ పెడదాం.. కసితో పనిచేయండి అంటూ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, మంత్రులు ఇంకా అబద్ధాలు చెబుతూనే ఉన్నారని మండిపడ్డారు.. దుబ్బాకలో ప్రజలు ఓడించినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదన్న ఆయన.. కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది.. సీఎంగా…
తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్ సహా పలు సెట్లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ఇక, ఇవాళ టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.. ఆగస్టులో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనుండగా.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 24వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రవేశ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులు మార్చి 24 నుంచి మే 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చిన పేర్కొంది ఉన్నత విద్యామండలి.. ఇక, లేట్ ఫీతో జులై…
తెలంగాణ మణిహారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయింది. మేఘా భూగర్భ ఇంజనీరింగ్ అద్భుతంతో గాయత్రి పంపింగ్ కేంద్రంలో మరో రికార్డ్ నమోదయింది. అనతికాలంలోనే భూగర్భ అద్భుతం గాయత్రి పంప్ హైస్ నుండి 100 టిఎంసీల ఎత్తిపోత ప్రారంభం అయింది. గాయత్రి పంప్ హౌస్ నుండి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. ఆగష్టు 8, 2019లో గాయత్రి పంప్ హౌస్ ను మేఘా ప్రారంభించింది. అత్యధికంగా 1703…
దేశవ్యాప్తంగా తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ కొత్త పాజిటివ్ కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది.. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కేసులు ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.. మరోవైపు మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. దీంతో.. పొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.. ముఖ్యంగా మహారాష్ట్రలో సెకండ్ వేవ్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్…