లాక్‌డౌన్ ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్ వల్ల తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,38,182 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 2070 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. కరోనా బారినపడి మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 5,89,734 కరోనా కేసులు, 3364 మరణాలు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో.. 3,762 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 29,208 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. కాగా, గత బులెటిన్‌లో 2,175 కొత్త కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.. క్రమంగా రోజురోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య దిగివస్తోంది.