జూన్ 9 వ తేదీన తెలంగాణలో లాక్‌డౌన్ ముగియబోతున్నది. మే 31 నుంచి పదిరోజులపాటు లాక్‌డౌన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో జూన్ 8 వ తేదీన తెలంగాణ కేబినెట్ మరోసారి భేటీ కాబోతున్నది. జూన్ 8 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. ఈ భేటీలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్, రైతుబంధు తదితర విషయాలపై చర్చించబోతున్నారు. ఇక, రాష్ట్రంలో డయాగ్నోస్టిక్ సెంటర్లను జూన్ 9 వ తేదీకి వాయిదా వేశారు. జూన్ 9 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 9 వ తేదీన ఒకేసమయంలో రాష్ట్రవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్లను మంత్రులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.