కరోనా సెకండ్‌వేవ్ పంజా విసురుతోంది.. కరోనా మహమ్మారి తొలినాళ్లలో అన్ని ఆలయాలు మూతపడి.. క్రమంగా ఆ తర్వాత తెరుచుకున్నాయి.. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతితో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో.. ఈ నెల 18వ తేదీ నుండి 22 వరకు రాజన్న ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు.. మొత్తంగా ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి అనుమతి రద్దు చేశారు దేవాదాయ శాఖ అధికారులు.. ఇక, ఈనెల 21న రాజన్న…
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి.. బుధవారం రోజు బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ కామెంట్లు చేయగా.. సీఎం వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జానారెడ్డి.. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ అహంకారానికి.. సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్న ఆయన.. అధికార పార్టీ తీరు తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చావు…
నిన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిమీ ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.6 కిమి నుండి 5.8 కిమీ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరియు కేరళ తీరం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదగా ఉపరితల ద్రోణి/ గాలి విచిన్నతి ఏర్పడింది. రాగల మూడు రోజులు (15,16,17వ.తేదీలు)…
హైదరాబాద్ లో కరోనా బెడ్స్ దొరికే పరిస్థితి లేదు.. ఇప్పటికే ఆస్పత్రుల్లోని బెడ్లన్నీ పేషెంట్లతో నిండి పోయాయి.. లకిడికాపూల్ ఓ ఆస్పత్రిలో కరోనా కోసం 40 బెడ్లు కేటాయించారు. మొత్తానికి మొత్తం రోగుల తో నిండిపోవడంతో కొత్తవాళ్ళు చేరే పరిస్థితి లేదు. ఒక్కటి హాస్పిటల్ లోనే కాదు దాదాపు చాలా హాస్పిటల్స్ లో అదే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన నేపధ్యంలో అన్ని హాస్పిటల్స్ లో చికిత్స మొదలు…
ఫస్ట్ వేవ్‌లోనే చాలా మంది ప్రజాప్రతినిధులను పలకరించిపోయింది కరోనా మహమ్మారి.. కొందరు నేతలు, ప్రముఖుల ప్రాణాలు సైతం తీసింది.. తాజాగా, సెకండ్ వేవ్ కలవర పెడుతుండగా.. మరో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇవాళ ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో.. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఆంక్షలను కఠినం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మాస్క్ ను తప్పనిసరి చేశారు. మాస్క్ లేకుండా బయట కనిపిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3307 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య…
వైఎస్ షర్మిల ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పార్టీ పేరు, జెండా అజెండాను వైఎస్ఆర్ జయంతి రోజున ప్రకటిస్తానని చెప్పారు. ఇక నిరుద్యోగుల కోసం ఆమె ఈరోజు నుంచి మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేయబోతున్నారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె దీక్షకు దిగుతున్నారు. ఇక ఇదిలా ఉంటె, త్వరలోనే రాష్ట్రంలో ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ షర్మిల…
తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తో DM అండ్ HO ల టెలి కాన్ఫరెన్స్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. 10 ఆ పైన బెడ్స్ ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1691 నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి అందులో 41 వేల బెడ్స్… ఉన్నాయని చెబుతున్నారు. వీటిలో ఆక్సిజన్ ఫెసిలిటీ ఉన్న బెడ్స్ 10వేలు కాగా. 5వేల ICU బెడ్స్, 1500 వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని…
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరణమృదంగం మోగుతోందా ? కేవలం 24 గంటల వ్యవధిలో 35 మంది ఎందుకు మరణించారు ? గాంధీలో కరోనా పేషంట్ల మరణాల రేటు ఎక్కువగా ఎందుకు ఉంటోంది ? అనేది పరిశీలిస్తే కీలక విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో కరోనా చికిత్సకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆసుపత్రి గాంధీ. ప్రస్తుతం 305 మంది పేషెంట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు పదిహేను వందల బెడ్లతో భారీగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో…
సినీనటి, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు. కేసీఆర్ కి ఏనాడు దళిత బిడ్డలపై ప్రేమ లేదని అన్నారు. బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి లేదని, కేసీఆర్ చాలా హీనంగా మాడ్లాడుతున్నారని, తెరాస గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంట మంచిది అని విజయశాంతి పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబపాలన పోవాలని, అందరికి న్యాయం జరగాలని విజయశాంతి ఆకాంక్షించారు. కేసీఆర్, మంత్రులు ప్రజల్ని కుక్కలు అం సంబోధిస్తున్నారని మండిపడ్డారు. తెరాస నేతల వార్నింగ్ లకు తాము భయపడేది…