రైతులకు తెలంగాణ శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పార్ట్-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. జూన్ 10ని కట్టాఫ్ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. రైతుబంధు నిధుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. అపోహకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తొలిసారి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల బ్యాంకు అకౌంటు వివరాలు వ్యవసాయ అధికారులు సేకరిస్తారని పేర్కొన్నారు.