తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. సీఎం కేసీఆర్ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా చెకింగ్ చేస్తానని, చెప్పకుండా… చెయ్యకుండా వచ్చి పరిశీలిస్తానని అన్నారు. ఆఫీసర్లు అందుబాటులో ఉండి తానడిగిన రిపోర్టులివ్వాలని… తేడా వస్తే స్పాట్లోనే సస్పెన్షన్లు ఉంటాయని సీరియస్‌గా హెచ్చరించారని గుర్తుచేసిన ఆమె.. సీఎం మాటలకు భయపడాల్సిన పనిలేదని అధికారులకు బాగా తెలుసు అని ఎద్దేవా చేశారు.. ఎందుకంటే,…
నిన్నటి ఉత్తర పశ్చిమ అల్పపీడన ద్రోణి ఈ రోజు బలహీన పడింది. అల్పపీడనము ఈరోజు దక్షిణ ఝార్ఖండ్ & పరిసర ప్రాంతాలలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనము మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు వ్యాపించి, ఎత్తుకు వెల్లే కొలది అల్పపీడనం నుండి నైరుతి దిశగా తెలంగాణా వైపుకి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం. ఈ రోజు (14,వ తేదీ) తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా ప్రదేశములలో మరియు…
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములని వేలం వేయాలని ప్రభుత్వ రహస్య ఎజెండా పెట్టుకుంది అని అన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. భూముల వెలం ఆపాలని కిసాన్ కాంగ్రెస్ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కి లేఖ రాసాము. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో వెలం వేస్తుంటే మేము అడ్డుకున్నాము. ఆంధ్ర పాలకులు ప్రజల ఆస్తులు అమ్మారు అని కెసిఆర్ ప్రజలని రెచ్చగొట్టారు. అటవీ భూములని పెదలకి ఇచ్చాము. రెవిన్యూ లో ఉన్న రహస్య ఎజెండా…
మాజీ మంత్రి ఈటల రాజేదర్.. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరిన వేళ ఆ పార్టీపై సెటైర్లు వేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ… నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, రెండు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలను ప్రస్తావించారు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సెక్యూరిటీ డిపాజిట్‌ను దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైందని ఎద్దేవా చేసిన ఆయన.. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కోల్పోయిందని విమర్శించారు.. మరోవైపు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్‌చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ తో పాటుగా ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్, అశ్వద్ధామ రెడ్డి, ఓయు జేఏసీ నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ రోజు ఉదయం శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ కేంద్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చేరికలు చేరాయి. బీజేపీ చేరిన తరువాత ఈటల మాట్లాడారు.…
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆల్‌టైమ్ స్థాయిలో ధరలు నమోదయ్యాయి. లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు పెరగ్గా, డీజిల్‌పై 31 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో రూ.100.26 పైసలకు చేరింది. పెరిగిన పెట్రోల్ ధరలపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిన సంగతి తెలిసిందే. దేశంలో పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ ఆంధోళనలు చేస్తున్నది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్…
హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఉదయం 11ః30 గంటలకు బీజేపీలో చేరబోతున్నారు. ఉదయాన్నే ఈటల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢల్లీకి బయలుదేరారు. ఈటలతో పాటుగా మరో 20 మంది కూడా అదే విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. బీజేపీ జాతీయ ఆధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల, ఆయన అనుచర వర్గం బీజేపీలో చేరనున్నారు. దేవరయాంజల్ భూములను ఈటల అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు రావడంతో ఆయన్ను…
ఈరోజు తెల్లవారుజాము నుంచి నగరంలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడటంతో లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. తెల్లవారు జాము 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వర్షం కురిసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పీసీసీ నియామకంపై పెద్ద రచ్చ నడుస్తోంది. పీసీసీ నాకంటే నాకు అని.. సీనియర్లు, జూనియర్లు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ నియామకంపై మరోసారి విహెచ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న మొన్న పార్టీ లోకి వచ్చిన వారికి పీసీసీ ఇస్తే.. మా ఆత్మగౌరవం దెబ్బతింటదని విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కొత్త వారికి ఇచ్చి మా ఆత్మగౌరవం దెబ్బతినేలా చేస్తే.. పరిణామాలు ఏంటనేది ఇప్పుడే…