హఫీజ్‌పేట్ భూముల కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్ వివాదాస్పద భూముల కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. హఫీజ్‌పేట్ భూములపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. భూములను యథాతథ స్థితిలో కొనసాగించాలని ఆదేశించింది.. కాగా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లింది తెలంగాణ ప్రభుత్వం.. వారం రోజుల క్రితమే మరో స్పెషల్ లీవ్ పిటిషన్‌ని అనుమతిస్తూ సర్వే నెంబర్ 80లో సి కళ్యాణ్‌తో పాటు మరికొందరికి టైటిల్ లేదని.. లేని టైటిల్ భూమిలో ఎలా నిర్మాణాలు చేపడతారని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది… ఈ కేసులో అన్ని పిటిషన్లు కలిపి సుప్రీంకోర్టు విచారణ చేపడుతుండగా.. అత్యంత విలువైన భూములను తమకు టైటిల్ ఉందని దశాబ్దాలుగా భూమిపై ఉన్నారు బడాబాబులు. కాగా, సర్వే నెంబర్ 80లోని కోట్లాది రూపాయల విలువైన భూములు తమవేనని రాష్ట్ర సర్కార్, స్టేట్ వక్ఫ్‌బోర్డులు చేసిన వాదనలను గతంలోనే కొట్టివేసింది హైకోర్టు.. ఆ భూములు ప్రైవేట్‌వేనని, ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అవి వక్ఫ్ భూములంటూ గతంలో ఇచ్చిన గెజిట్‌ను న్యాయస్థానం తప్పుబట్టింది.. సర్వే నంబర్ 80డీలోని 50 ఎకరాల భూములను నలుగురు పిటిషనర్ల పేరుతో రికార్డుల్లోకి ఎక్కించాలని ఆదేశించింది. వారికి కోర్టు ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కూడా గతంలోనే ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకు సూచించింది. దీంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం.
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
తాజావార్తలు
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!