ఈ నెల 15 నుండి రైతుబంధు పథకం నిధులు విడుదల కానున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వరసగా ఏడోసారి రైతుబంధు నిధులు విజయవంతంగా రైతుల ఖాతాలలోకి రానున్నాయి. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గాను రూ.14,656.02 కోట్లు విడుదల కాగా, ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్ లో రూ.14,800 కోట్లు కేటాయించి ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఐతే తాజాగా రైతుబంధుకు 63.25 లక్షల మంది అర్హులు అని…
వాయువ్య బంగాళ ఖాతం పరిసర పశ్చిమ బెంగాల్ తీరం, ఉత్తర ఒడిస్సా ప్రాంతంలో స్థిరంగా అల్పపీడనము కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనము మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు వ్యాపించింది. రాగల 2 నుండి 3 రోజులలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా, జార్ఖండ్,ఉత్తర ఛత్తీస్‌ఘడ్ మీదగా వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర పశ్చిమ ద్రోణి, అల్పపీడన ప్రాంతం నుండి దక్షిణ ఛత్తీస్‌ఘడ్, ఉత్తర తెలంగాణా, ఉత్తర మధ్య…
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఈటల రాజేందర్ విషయం హల చల్ గా మారింది. తెరాస పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక రేపు ఢిల్లీ వెళ్లనున్న ఈటల అక్కడ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ను మోసం చేసిన వ్యక్తిగా ఈటల నిలిచి పోతారు అని తెలిపారు. తెలంగాణ ప్రజల…
ఈటల రాజేందర్ నిన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దానిని స్పీకర్ అంగీకరించారు, ఇక బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఈటల రాజేందర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరో ఆరుగురు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు. అయితే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు…
సాహిత్యస్పూర్తి, సమయస్పూర్తి, సభాస్పూర్తి, స్నేహ స్ఫూర్తి కలబోసుకున్న స్పురద్రూపి సినారె. రాతకూ కూతకూ పాటకూ మాటకూ కలానికి గళానికి సరిహద్దులు చెరిపేసిన వారు. ‘నిలకడగా వున్న నీళ్లలో కమలాలే కాదు, క్రిములూ పుడతాయి’ అని రాసిన సి.నారాయణరెడ్డి నిజంగానే చలనశీలంగా బతికారు, కొన్నేళ్ల కిందట త్యాగరాయ గానసభ వేదికపై ఆ చరణాలు చెప్పి తన కవిత్వం ప్రవాహ గుణ ప్రధానమని వర్ణిస్తే నన్ను మెచ్చుకున్న సినారె సభలో పాల్గనని రోజు వుండేది కాదు. ఇంత సభా సంచారంలోనూ…
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ప్రతీరోజు లక్షకు పైగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నా.. పాజిటివ్ కేసులు మాత్రం రెండు వేల లోపే నమోదు అవుతున్నాయి.. తాజాగా ఆ కేసుల సంఖ్య 17 వందలకు చేరువైంది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,20,525 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1771 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 13 మంది కోవిడ్ బారినపడి…
నిన్న ఏర్పడిన అల్పపీడనం.. ఈ రోజు వాయువ్య బంగళా ఖాతం &పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనము వ్యాపించింది. రాగల 2 నుండి 3 రోజులలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా, జార్ఖండ్,ఉత్తర ఛత్తీస్‌ఘడ్ మీదగా వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర పశ్చిమ ద్రోణి, అల్పపీడన ప్రాంతం నుండి దక్షిణ ఛత్తీస్‌ఘడ్, విధర్బా, ఉత్తర మధ్య మహారాష్ట్ర…
టీఆర్ఎస్కు ఇప్పటికే రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్.. ఇవాళ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించడం జరిగిపోయాయి.. ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరనున్న ఆయన.. నైతిక బాధ్యత వహిస్తూ.. టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. దీంతో.. కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.. ఈటల రాజీనామా వ్యవహారంపై స్పందించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. పార్టీ మారుతున్నఈటల నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే…
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఓ నిర్ణయానికి వచ్చి.. పీసీసీ, ఇతర కమిటీలపై ప్రకటన చేసే సమయానికి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు వచ్చాయి.. ఉప ఎన్నికలు ముగిసేవరకు పీసీసీ ప్రకటన వాయిదా వేయాలంటూ సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తిపై ప్రకటన వాయిదా వేసింది అధిష్టానం.. ఎన్నికలు ముగిసిపోయినా.. దీనిపై ప్రకటన రాకపోగా.. పదవులకోసం మళ్లీ లాబియింగులు మొదలయ్యాయి.. తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ నియామక…
దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు కాపాడాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. అవసరాల తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోని అయినా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. మూడో విడత కోవిడ్ ఉధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరిక నేపథ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు. కోవిడ్ 19 చికిత్స కు…