సూర్యాపేటలో కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్.. భారత్-చైనా సరిహద్దులో విధులు కర్నల్ సంతోష్ బాబు విధులు నిర్వహిస్తుండగా.. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట 15 జూన్ 2020న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరోచితంగా పోరాటం చేసి అమరుడయ్యారు.. ఆయనతో పాటు మరికొందరు భారత సైనికులు అమరులయ్యారు.. ఆ వీరుడు నేలకొరిగి ఏడాది గడిచింది.. దీంతో.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో కర్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని…
ఈ రోజు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.. నిన్నటి ఝార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనము ఈరోజు తెలంగాణ నుండి దూరంగా వెళ్ళిపోయింది. నైరుతి రుతువనాలు తెలంగాణాపై చురుకుగా కదులుతున్నవని.. ఈ రోజు క్రింది స్థాయి నుండి పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో.. రాగల మూడు రోజులు (15,16,17వ తేదీలు) తేలికపాటి…
టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ నిన్నటిరోజున బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ధర్మేంధ్రప్రధాన్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా, ఈరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. బీజేపీలో చేరిన ఈటలపై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిరోజే ఈటలకు పరాభవం ఎదురైందని, నడ్డా సమక్షంలో ఈటల ఎందుకు చేరలేదని విమర్శించారు. కమ్యునిస్టుల భావజాలం ఎక్కడపోయిందని, ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల బీజేపీలో చేరారని అన్నారు. టీఎంసీలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేసి బీజేపీ…
రేపు సూర్యాపేట జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. హుజుర్ నగర్ లో నీలకంఠ సాయి కుటుంబాన్ని ఈ పర్యటనలో షర్మిల పరామర్శించనున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని మనస్తాపంతో నీలకంఠ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే కరోనాతో మృతిచెందిన గుణ్ణం నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు షర్మిల. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన నాగిరెడ్డి…వైఎస్సార్ కు వీరాభిమాని. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. రేపు ఉదయం 7.30 గంటలకు లోటస్ పాండ్ నుండి షర్మిల బయలుదేరనున్నారు. కాగా…
తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నది. రోజూ లక్షలాదిమందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చెపడుతున్నారు. ఇందులో భాగంగా పోలీసుల ఆద్వర్యంలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులకు, వారి కుటుంబసభ్యులకు, వారి బంధువులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఈరోజు హోంశాఖా మంత్రి,సీపీ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో లాక్డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని, త్వరలోనే రాష్ట్రంలో తిరిగి మాములు జీవనం ఆరంభం…
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్నారు జస్టిస్ ఎన్.వి రమణ. ఈ సందర్బంగా యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద ఎన్వీ రమణకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అలాగే ఆలయ అర్చకులు సీజేఐ దంపతులకు పూర్ణకుంభంతో…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్ఎస్కూ, శాసనసభ్యత్వానికీ రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. ఢిల్లీలో బిజెపి జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో చేరతారని వార్తలు వచ్చినా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే ఈ చేరికకు ఆధ్వర్యం వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బిజెపి ఇన్చార్జి తరుణ్‌చుగ్ తదితరులతో కలసి తర్వాత నడ్డాను కలిసి ఆ లోటు భర్తీ చేసుకోవలసి వచ్చింది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీ…
కరోనా మహమ్మారి కట్టడిలో ఇప్పుడు వ్యాక్సిన్ల పాత్ర కీలకమైనది.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయగా.. మరోవైపు.. ఉత్పత్తి కూడా అదే స్థాయిలో జరుగుతోంది.. ఇక, ఈ సమయంలో.. వ్యాక్సిన్ తయారీ చేస్తున్న సంస్థల దగ్గర భారీ భద్రత కల్పిస్తోంది సర్కార్.. ‘కోవాగ్జిన్’ తయారు చేస్తోన్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థకి భద్రత కల్పించారు.. హైదరాబాద్ శామీర్‌పేట్‌లో ఉన్న భారత్ బయోటెక్ ప్లాంట్ దగ్గర సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్కూరిటీ ఫోర్స్)తో భద్రత పటిష్టం చేశారు.. పారా మిలిటరీ…
కరోనా మహమ్మారి కాలంలో నేతన్నలకు రూ.109 కోట్ల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు తెలంగాణ పరిశ్రమలు, టెక్స్ టైల్ శాఖా మంత్రి కేటీఆర్.. నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన ఆయన.. ఈ పథకం ద్వారా కరోనా కాలంలో నేతన్నలకు రూ. 109 కోట్ల మేర లబ్ధి చేకూరిందని వెల్లడించారు.. గత ఏడాది కరోనా నేపథ్యంలో లాకిన్ గడువు కన్నా ముందే నిధులు పొందేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్న ఆయన.. ఈ పథకం పునః ప్రారంభం ద్వారా…
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1511 కరోనా కేసులు నమోదు కాగా.. 12 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో 1.36 పాజిటివ్ రేటుగా వుంది. ప్రస్తుతం 16 శాతం బెడ్ ఆక్యుపెన్సీ ఉంది. ప్రతి రోజు 2 లక్షల మందికి వాక్సిన్ జరుగుతుందని తెలంగాణ వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80 లక్షల డోసులు వాక్సిన్ పూర్తి కాగా, 9 లక్షల 25 వేల స్టాక్ రాష్ట్రంలో ఉంది.…