తెలంగాణలో కరోనా కేసులు ఈరోజు తగ్గాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 449 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 623 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,406 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,37,175 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,825 కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు…
సిద్దిపేటలో టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు బాల్క సుమన్, కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… బీజేపీ అసత్య ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. గోబెల్స్ కన్నా తీవ్ర స్థాయిలో అబద్ద ప్రచారం.గొెబెల్స్ బ్రతికి ఉంటే బీజేపీ ప్రచార తీరు చూసి ఉరి వేసుకుంటాడు. 2014 లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాయి. హుజూరాబాద్ లో అసలు బీజేపీ వాళ్లు…
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వాసాలమర్రిలో ఇచ్చినట్టుగా.. భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా దళిత బంధు ఇస్తే.. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు కోమటిరెడ్డి.. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పోటీకూడా చేయనని స్పష్టం చేశారు. కావాలంటే బాండ్ కూడా రాసిస్తానన్నారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్లోజరిగిన కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి… నియోజకవర్గ అభివృద్దే నాకు ముఖ్యమని.. తర్వాతే పదవులు అన్నారు. ఇక, ఎవరు…
పిఆర్సీ అమలు చేసిన సందర్భంగా సిద్దిపేటలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వంకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేసారు. దీనికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇంటింటికి నీళ్లు ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి షెకావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. వారు బీజేపీ అయినా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు అంటే పని చేస్తేనే ప్రశంసిస్తారు అనే మాట గుర్తుంచుకోవాలి. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయం లో తెలంగాణ…
1981 ఏప్రిల్ 20వ తేదీన జల్.. జంగల్.. జమీన్.. కోసం ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. హక్కుల సాధనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటన 40 ఏళ్లు పూర్తిచేసుకుంది.. అయితే, ఇప్పుడు ఇంద్రవెల్లి దండోరాతో ప్రస్తుత ప్రభుత్వాన్ని మోసాన్ని ఎండగతాం అంటోంది.. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ… దీనిపై పలురకాలర విమర్శలు వినిపిస్తున్నాయి.. వీటిపై ఎన్టీవీతో మాట్లాడిన…
ఇంటింటికి నీళ్లు ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి షెకావత్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.. వారు బీజేపీ అయినా.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.. అంటే పని చేస్తేనే ప్రశంసిస్తారు అనే మాట, గుర్తుంచుకోవాలని.. రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు… పీఆర్సీ అమలు చేసిన సందర్భంగా సిద్దిపేటలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో…
రేపు జరుగబోయే ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సభకు హాజరుకాలేదని ఎవరు తప్పుడు ప్రచారం చెయ్యెద్దని.. ముందుగానే వివరణ ఇస్తున్నాను అని జగ్గారెడ్డి చెప్పారు. గతం వారం రోజులుగా జ్వరంగా ఉంది. అందుకే కోర్ట్ కు కూడా హాజరు కాలేకపోయాను. వారెంట్ కూడా వచ్చింది. ఈ కారణంగానే సోమవారం జరగనున్న ఇంద్రవెల్లి దండోరా సభకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. సమన్వయకర్తగా సభ ఏర్పాట్లపై ఇప్పటికే పలుమార్లు చర్చించానని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్…
తెలంగాణకు నది అంటేనే మూసి… దానిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అని చౌటుప్పల్ కాంగ్రెస్ కార్యాలయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మూసి ప్రక్షాళన కోసం రేపు పార్లమెంట్ లో మాట్లాడుతా అని తెలిపారు. హిట్లర్ బతికుంటే కేసీఆర్ ను చూసి ఏడ్చేవాడు. సీఎం వాసలమర్రి కి రెండు సార్లు వస్తే,ఎంపీ గా నాకు సమాచారం ఇవ్వలేదు .ఈ ప్రబుత్వం లో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీ లకు ప్రోటోకాల్ ఇవ్వరు. సీఎం పక్కన కూర్చుంటే ఆయన…
ఉప ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రాకముందే.. హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతూనే ఉంది… అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్.. మళ్లీ ట్రాక్‌లో వచ్చారు.. ఇవాళ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు… ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా.. నా గెలుపును ఎవ్వరూ ఆపలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వస్తవా.. రా..! హరీష్‌రావు ఇక్కడ పోటీ చేద్దాం.. వస్తావా..? రా..…
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు స్వల్ప గాయాలయ్యాయి… ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మంద కృష్ణ… ఓ ప్రైవేట్ హోటల్లో దిగారు.. అయితే, హోటల్ గదిలోని బాత్రూమ్లో జారిపడ్డ మందకృష్ణ మాదిగకు స్వల్ప గాయాలు అయినట్టు చెబుతున్నారు.. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు ఆయన అనుచరులు… ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.