అసలే కరోనా సమయం.. బతకడమే కష్టంగా మారింది.. ఎన్నో ఉద్యోగాలు ఊడిపోయాయి.. ఉపాధిపై కరోనా ఘోరంగా దెబ్బకొట్టింది. ఈ సమయంలో.. ఈఎంఐలు కట్టడం కష్టంగా మారిన పరిస్థితి.. కానీ, ఓ ఆటో డ్రైవర్‌కు ఫైనాన్స్ కంపెనీల వేధింపులు ఎక్కువయ్యాయి.. మరోవైపు పోలీసుల వేధింపులు పెరిగాయని.. పెట్రో ధర భారం కూడా పడిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్.. తాను ఫైనాన్స్‌లో తీసుకున్న ఆటోపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.. ఈ ఘటన హన్మకొండలోని కాళోజీ జంక్షన్ లో జరిగింది.. ఆటో పూర్తిగా కాలిపోయింది. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల జీవనోపాధి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు డ్రైవర్… కరోనాకు తోడు ధరల పెరుగుదలతో అప్పుల భారం పెరిగిపోయాయని… ఆటో ఫైనాన్స్ చెల్లించలేక నిప్పటించానని చెప్పాడు. లాక్ డౌన్ లో కొద్ది రోజులు ఆటో తిరగలేదని ప్రస్తుతం ఆటల్లో తిరిగే వారు తక్కువయ్యారని తన గోడు వెల్లబోసుకున్నాడు.. ఈ నేపథ్యంలో వాహనాన్ని కాల్చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదని కన్నీరుమున్నీరయ్యాడు ఆటో డ్రైవర్.