పైన పటారం.. లోన లోటారం. తెలంగాణ బీజేపీలో ఇదే పరిస్థితి ఉందట. ఉన్న కొద్దిమంది నేతలూ ఒక్కమాట మీద లేరట. ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుడొకరు ఆ సమస్యకే మందు పూసి వెళ్లారట. కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నట్టు టాక్. మరి.. ఆయన మాటలు కమలనాథుల చెవికి ఎక్కాయా? పార్టీ నేతల మధ్య ఉన్న ఇబ్బందేంటి? బీజేపీలో ముఖ్యనేతల మధ్య గ్యాప్ ఉందా? శరీరానికి దెబ్బ తగిలితే మందు రాస్తారు. చికిత్స చేస్తారు. అదే మనసుకు గాయమైతే..? కోలుకోవడానికి…
మిషన్ భగీరథ పథకంపై మరోసారి కేంద్రం ప్రశంసలు కురిపించింది. ఛత్తీస్ ఘఢ్ పర్యటనలో ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. మిషన్ భగీరథ పథకం గురించి ప్రస్తావించారు. దేశంలో వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని..తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి అభినందించారు కేంద్ర మంత్రి. దేశంలో ప్రతి ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని ఇవ్వాలనే లక్ష్యానికి చేరువ అయ్యామని కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. దేశంలో ప్రతి ఇంటికీ మంచినీరు అనే…
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు అందించేందుకు ముందుకు వచ్చారు పలువురు ప్రజాప్రతినిధులు. ఈ నేపథ్యంలోనే నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్రిచక్ర వాహనాలను అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తామని.. అనవసర ఖర్చు కూడా చేయాల్సి వస్తుందని చెప్పారు. బ్యానర్లు, హోర్డింగ్స్ పెట్టి వృధా ఖర్చు చేస్తాం. దాన్ని…
ప్రగతి భవన్ లో ఈరోజు ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ లోని అంశాలపై చర్చించనున్నారు. ఇక ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు తెలంగాణ లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటుందని తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. తెలంగాణాలో జల విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి కొరత ఏర్పడుతోందన్న టీ సర్కార్…అధిక నీటిని వాడుతున్న ఏపీని నిలువరించాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు…
గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 7:15 గంటల నుంచి 8:20 గంటల మధ్యలో మూడుసార్లు భూమి కంపించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 2.3,2.7,3 గా నమోదయింది. పులిచింతలతో పాటుగా తెలంగాణలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ, సూర్యపేటలోనూ స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోపల పొరల్లో వస్తున్న మార్పుల కారణంగా భూప్రకంపనలు కలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read: “పాగల్” టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్
రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఏకం కావాలన్నారు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్. బహుజనులంతా తన వెంట ఉంటే పేదల హక్కుల కోసం ఎంతటి పోరాటానికైన సిద్ధమని స్పష్టంచేశారు. ఈ రోజు నల్గొండలో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టనున్నారు. రాజ్యాధికార సంకల్ప సభ పేరిట బహుజన సమాజ్ పార్టీ నల్లగొండలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీ కండువా కప్పుకోనున్నారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ రాంజీ…
సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. శనివారం సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని సిఎం కేసీఆర్ పరిశీలించారు. నలుమూలలా కలియతిరిగి పరిశీలించారు. పరిపాలనకు కేంద్ర బిందువు గా వుండే సెక్రటేరియట్ నిర్మాణ కౌశలం మన పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా ఉండాలని సిఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతర పరిస్థితుల్లో,సిబ్బంది మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకునే విధంగా సచివాలయ నిర్మాణం వుండబోతోందని తెలిపారు. గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు…
కరీంనగర్ కి చెందిన బీజేపీ నాయకుడు, న్యాయవాది భేతి మహేందర్ రెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు గ్రానైట్ సంస్థల్లో ఎలాంటి భాగస్వామ్యం లేకున్నా అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత రాజకీయ పరువుకు నష్టం కలిగించేలా మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 152 ఏ, 505 (ii) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 1,05,201 శాంపిల్స్ పరీక్షించగా… 569 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 657 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,957 కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,36,552 కి పెరిగింది.. ఇక,…
అనేక ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఒక్క ఓటమితో సోదిలో లేకుండా పోయారు. అన్నీ వరస ఎదురుదెబ్బలే. పార్టీని కాదని వేస్తున్న పొలిటికల్ స్టెప్పులు తడబడుతున్నాయి. ఇప్పుడు సీటుకే ఎసరొచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ మాజీ మంత్రి దారెటు అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? ఐదుసార్లు గెలిచిన చోట సీటుకు ఎసరొచ్చిందా? జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్‌లో.. టీఆర్ఎస్లో ఓ వెలుగు వెలిగిన నాయకుడు.. ప్రస్తుతం చర్చల్లో కూడా లేరు. ఉమ్మడి మహబూబ్‌నగర్…