హుజురాబాద్ దళితభాధితుల సంగం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ ఈటల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నియోజక వర్గంలో నలుగురు చావులకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరోక్షంగా బాద్యుడు అతనిపై హత్య యత్నం కేసు నమోదు చేయాలి. కమలపూర్ మండలంలో ఉప సర్పంచ్ సుధాకర్ శిలాఫలకం ధ్వంసం చేశాడని కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీస్ స్టేషన్ నుండి విడుదల అయిన తరువాత నెలకే ఆక్సిడెంట్ లో మృతిచెందడం ఆంతర్యమేమిటి అని అన్నారు. కమలపూర్ మండలం శ్రీరాములపల్లి కంచరకుంట్ల భగవాన్ రెడ్డి వాన్ తో డి కొట్టిన హత్య లో కూడా ఈటల రాజకీయ కోణం ఉంది అని తెలిపారు. ఇక వీణవంక మండలం నర్సింగపూర్ లో mptc బాల్ రాజ్ హత్యలో కూడా ఈటల ప్రమేయం ఉంది. పెద్దపాపయ్య పల్లి ప్రవీణ్ కుమార్ పై అక్రమ కేసులు పెట్టడంతో మరణించాడని దీనికి కూడా ఈటెల రాజేందర్ ప్రమేయం ఉంది. పై వాటిపై పూర్తి స్థాయిలో పోలీస్ ఉన్నతాధికారులతో విచారణ చేపట్టి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై హత్య కేసులు నమోదు చేయాలి అని పేర్కొన్నారు.