తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ వ్యతిరేకవర్గం స్వరం పెరుగుతోందా? అదను కోసం చూస్తున్న సీనియర్లు గట్టిగానే గళం విప్పుతున్నారా? పీసీసీ చీఫ్ లేని సమయంలో పావులు కదపడం వెనక వ్యూహం ఏంటి? ఎక్కడ సభలు పెట్టాలో చెప్పిన నాయకులే.. బయట మరోలా ప్రచారం చేస్తున్నారా? లెట్స్ వాచ్! రేవంత్ లేని భేటీలో సీనియర్లు జూలు విదిల్చారా? తెలంగాణ కాంగ్రెస్లో హడావుడి కామన్. అంతకుమించి అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కామన్. దానికి అద్దంపట్టే ఘటనలు తరచూ జరుగుతుంటాయి. గురువారం నాటి…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 364 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 482 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,758 కు చేరగా.. రికవరీ కేసులు 6,44,294 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జీతాలు ఇవ్వలేని సీఎం కేసీఆర్ దళితబంధు ఎలా ఇస్తాడో చెప్పాలని… ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ పనిచేస్తాడని నిప్పులు చెరిగారు. దళితబంధు పేరుతో మరోసారి దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని… 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను తీవ్ర అన్యాయమన్నారు. పాలన గాలికొదిలేసి కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నాడని… కరోనా…
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్’ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా వుండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భం గా సిఎం తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు సుఖ శాంతులతో ఉండాలని సీఎం…
కరోనాను తరిమేసేందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. సాధ్యమైనంత త్వరలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నాయి ప్రభుత్వాలు.. ఇందులో భాగంగా రెగ్యులర్గా ప్రభుత్వ ఆస్పత్రలు, పీహెచ్సీ సెంటర్లలో.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సాగుతున్నా.. మరింత విస్తృతంగా వ్యాక్సిన్ వేయాలన్న ఉద్దేశంతో.. జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ ఏరియాలలో కోవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఈ నెల 23వ తేదీ నుండి 10-15 రోజుల పాటు ఈ స్పెషల్…
ఇందిరా శోభన్ పార్టీ వీడటంపై వైఎస్సార్ టిపి స్పందించింది. ఇందిరా శోభన్ ని నాయకురాలిగా తయారు చేశామని… ఆమె పార్టీని వీడటంతో ఎటువంటి నష్టం లేదని తెలిపారు వైఎస్సార్ టిపి అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి. ఆరు చోట్ల వైఎస్ షర్మిల ఇప్పటి వరకు నిరుద్యోగ దీక్షలు చేశారని..7వ నిరుద్యోగ దీక్ష మంగళవారం మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం లింగాపూర్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు తూడి దేవేందర్ రెడ్డి. హుజురాబాద్ లో ఉప ఎన్నిక కోసమే…
20 నెలలు మనకు సవాల్… మన టార్గెట్ 72 సీట్లు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మణికమ్ ఠాగూర్.. యూత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు ఉంటుందని తెలిపారు.. యూత్ కాంగ్రెస్ నుండి నాయకులుగా ఎదిగిన వాళ్లే ఎక్కువగా పార్టీలో ఉన్నారని గుర్తుచేసిన ఆయన.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ఏఐసీసీ కార్యదర్శులు కూడా అయ్యారన్నారు.. వచ్చే 20 నెలలు కష్టపడి పని…
యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి… వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి నాయకులను కూడా యూత్ కాంగ్రెస్ అందించిందన్న ఆయన.. యూత్ కాంగ్రెస్ వాళ్లు టికెట్ల అడిగే ముందు… ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏం కొట్లాడినరో చూస్తాం అన్నారు.. టికెట్ తీసుకుని జనంలోకి పోతా అంటే… ఓడిపోతారు అని హితవుపలికిన రేవంత్రెడ్డి.. పోటీ చేసి ఓడిపోతే బాల్య వితంతులుగా మారిపోతారని.. చేతికి మట్టి అంటకుండా యూత్ కాంగ్రెస్ నాయకుడిని అంటే…
రైల్వే ప్రయాణికులకు అప్రమత్తం కావాల్సిన సమయంలో… ఇవాళ్లి నుంచి రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్ సేవలతో పాటు.. పలు సేవలకు తాతాల్కికంగా బ్రేక్ పడనుంది.. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో డిజాస్టర్ రికవరీ కార్యకలాపాలను నిర్వహించనున్న కారణంగా.. చార్టింగ్, కరెంట్ బుకింగ్, పీఆర్ఎస్ ఎంక్వైరీ, టికెట్ రద్దు, చార్జీలు రీఫండ్ తదితర పీఆర్ఎస్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోతాయని తెలిపింది దక్షిణమధ్య రైల్వే అధికారులు. ఇవాళ రాత్రి 11.45 గంటల నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు.. ఈ…
తెలంగాణ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలి. ధరల పెరుగుదల పై, నిరుద్యోగ సమస్యలపై చేస్తున్నారు.. కేసీఆర్ అక్రమాలపై కూడా పోరాటం చేయండి అని ప్రచార కమిటీ ఛైర్మెన్ మధు యాష్కీ అన్నారు. రాజకీయంగా ఎదగడానికి పనిచేస్తుంది. కేసీఆర్ కులాలలను విడదీసే కుట్ర చేస్తున్నాడు. రాజకీయ లబ్ధికోసమే దళిత బంధువు.. ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి. దళితలకు 3ఎకరాల భూమి ఏమైంది. దళిత బంధు కాదు.. బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా ప్రకటించాలి. బీజేపీ…