తెలంగాణ స్కూళ్లలో పెరిగిన విద్యార్థుల హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పద్దెనిమిది నెలల తరువాత తెలంగాణాలో మళ్ళీ ఈ నెల 1వ తారీఖు నుంచి స్కూల్స్ తెరుచుకున్నాయి. అయితే హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో విద్యార్థులు స్కూల్స్ కి ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది.గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 5,526 ప్రైవేటు.. 2,249 గవర్నమెంట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 16 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరిలో తొలి రోజు చాలాచోట్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగానే కనిపించింది. సుమారు 21.77 శాతం మంది విద్యార్థులు మొదటి రోజు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 35 శాతానికి చేరుకుంది.
Also Read
తల్లిదండ్రులు.. విద్యార్థులను భయం లేకుండా స్కూళ్లకు పంపిస్తున్నారని చెబుతున్నారు టీచర్లు. స్కూల్ మొత్తాన్ని రోజు సానిటైజ్ చేస్తున్నామని, స్కూల్‌లోనే వారికి మాస్క్ కూడా ఇచ్చి వాటిని పెట్టుకునేల ఏర్పాట్లు చేశామని అంటున్నారు. బైట్ : ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. చాలా రోజుల తరువాత స్కూల్స్ కి వెళ్లడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల కంటే ఆఫ్లైన్ క్లాసులు బాగున్నాయంటున్నారు విద్యార్థులు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాలలు కరోనా నిబంధనలు పాటిస్తున్నాయి. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తొలి రోజు వచ్చిన విద్యార్థుల హాజరు శాతానికి నేటికీ చాలా తేడా ఉంది. త్వరలోనే మళ్ళీ అన్ని స్కూల్స్ విద్యార్థులతో నిండిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..