ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీని వీడి.. అధికార టీఆర్ఎస్‌లో చేరారు పాడి కౌశిక్ రెడ్డి.. ఆ తర్వాత గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని శాసన మండలికి పంపనున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్.. దీనిపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్.. గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ఆ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు కూడా పంపించారు. అయితే, గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది..
తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. కౌశిక్ రెడ్డి ఫైల్ విషయంపై కూడా స్పందించారు. పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేసిన ఫైల్ నా దగ్గరే ఉందన్న గవర్నర్ తమిళిసై.. నేను ఇంకా ఒకే చెప్పలేదన్నారు.. ఈ ఫైల్‌పై నాకు సమయం కావాలని వ్యాఖ్యానించారు. ఇది గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్ కాబట్టి… నేను స్టడీ చేస్తున్నట్టు తెలిపారు తమిళిసై.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక వరకు ఆపుతారా? అంటూ అడిగిని మరో ప్రశ్నకు స్పందిస్తూ.. మీరు ఏమైనా ఊహించుకోండి.. కానీ, నేను ఆ ఫైల్‌ను స్టడీ చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో.. పాడి కౌశిక్ రెడ్డిని అసలు ఎమ్మెల్సీగా నియమించేందుకు గవర్నర్ ఆమోదం తెలుపుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!