పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల జాబితాలో మొదట వినిపించే పేరు బండ్ల గణేష్. అయితే తాను అభిమానిని కాదు అని.. భక్తుడినని బండ్ల గణేష్ ఎప్పుడు చెప్తుంటాడు. కానీ ప్రజల కోసం ఓ పార్టీని స్థాపించి గత ఎన్నికలో పవన్ పోటీ చేయగా… బండ్ల గణేష్ మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే అది కోసుకుంటా.. ఇది కోసుకుంటా అంటూ మాట్లాడి.. తీరా ఎన్నికలో ఓడిన తర్వాత పార్టీనుండి తప్పుకున్నాడు. ఇక తాను ఏ పార్టీలో లేను అని ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్ తాజాగా ఓ ట్విట్ చేసాడు. అందులో ”తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన ఓ మహాశక్తిగా అవతరించబోతుంది” అని పేర్కొన్నాడు. దాంతో ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని… పవన్ స్థాపించిన జనసేనలో చేరబోయతున్నాడు అని ప్రచారం జరుగుతుంది. బండ్ల జనసేనలో చేరబోతున్నాడు అని గుసగుసలు వినిపిస్తుండటంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఆనందం నెలకొంది.