కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ అరకోటి మందికి పైగా టీకాలు అందిస్తున్నారు. ఇక తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. కాలనీలు, బస్తీల్లో కోవిడ్ సంచార టీకా వాహనాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ను అందించనున్నారు. 10 రోజులపాటు అర్హులైన అందరికీ వ్యాక్సిన్లు అందింబోతున్నారు. వైద్యారోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్…
ఉపఎన్నిక జరిగే హుజురాబాద్‌లో కాంగ్రెస్ వ్యూహం కొలిక్కి రావడం లేదు. బరిలో దిగే అభ్యర్థిపై క్లారిటీ ఉన్నా.. ప్రకటన చేయడానికి జంకుతున్నారు. వేచి చూద్దాం అనుకుంటున్నారో లేక ఇంకేదైనా వ్యూహం ఉందో కానీ నాన్చడానికే ప్రాధాన్యం ఇస్తున్నారట. దీంతో ఏమైందో గాంధీభవన్ వర్గాలకు అర్థం కావడం లేదట. రావిర్యాల సభలోనే హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించాలని అనుకున్నారా? హుజూరాబాద్ ఎన్నికపై ఆచి తూచి వ్యవహారం నడిపిస్తుంది తెలంగాణ కాంగ్రెస్. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయాలన్నది పార్టీ ఆలోచనగా…
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయ్. తెలంగాణ సీఎం కేసీఆర్..ఏపీ సీఎం జగన్‌కు మహిళలు రాఖీలు కట్టారు. రాజకీయ నేతలకు మహిళా నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ నివాసంలో రాఖీ వేడుకలు జరిగాయి. కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి..శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి నిదర్శనమన్నారు సీఎం కేసీఆర్. అటు…విజయవాడలో రాఖీ వేడుకలు జరిగాయి. సీఎం జగన్‌కు పలువురు మహిళలు రాఖీలు కట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
హుషారుగా మాజీ మంత్రి ఈటలతో పాటు విమానం ఎక్కి.. ఢిల్లీలో బీజేపీ చేరిన నేతలు.. ఇప్పుడు మళ్లీ కమలం పార్టీకి బైబై చెబుతున్నారు.. తాజాగా, ఈటల ప్రధాన అనుచరుడిగా పేరున్న టి.స్కాబ్ వైస్ చైర్మన్ పింగళి రమేష్.. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరినా.. మేం ఆ పార్టీలో ఇమడలేకపోతున్నాం అన్నారు.. అందుకే…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సాగనున్న సంజయ్ పాదయాత్ర.. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.. ఆగస్టు 24న హైదరాబాద్ ఓల్డ్‌సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. అయితే, మరోసారి సంజయ్ పాదయాత్ర వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది… ఎందుకంటే.. యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ శనివారం కన్నుమూశారు..…
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఆయనకు ప్రధాన అనుచరులుగా ఉన్న పింగిలి రమేష్, చుక్కా రంజిత్.. ఆయనకు గుడ్‌బై చెప్పేశారు.. వీరిలో పింగిలి రమేష్ సింగిల్ విండో వైస్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఓవైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు ఈటల రాజేందర్.. తన పాత అనుచరులతో కపులుపుకుని.. బీజేపీ శ్రేణులతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు.. కానీ, అప్పుడప్పుడు కొందరు ఈటలకు షాక్…
శ్రీశైలం డ్యామ్ ఏళ్లుగా పేరుకుపోయిన పూడికను తీసేందుఉ సర్వే మొదలు పెట్టారు.. డ్యామ్‌లో పూడికపై హైడ్రో గ్రాఫిక్ సర్వే చేస్తోంది ముంబైకి చెందిన 12 మంది నిపుణుల బృందం.. శ్రీశైలం డ్యామ్‌లో బోటుపై ప్రయాణిస్తున్న ఈ టీమ్.. బోటుపై నుంచి పరికరాలను నీటిలోకి పంపి పూడిక పరిమాణం ఏ స్థాయిలో ఉంది.. తీస్తే ఎంత మేర పూడిక తీయాల్సి ఉంటుంది అనే విషయాలపై లెక్కలు వేస్తోంది సర్వే బృందం.. కాగా, 308.62 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో…
పాఠశాలల రీ-ఓపెన్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం టేబుల్ పై ఉందన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేయడం వల్ల ప్రైవేట్ స్కూళ్లు, ప్రైవేట్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ట్రస్మా ప్రతినిధులు ఎమ్మెల్సీ పల్లాకు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల పునః ప్రారంభంపై సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా పల్లా చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యే…
హుజురాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉప ఎన్నికలు టీఆర్ఎస్కు కొత్త కానప్పటికీ …హుజురాబాద్ బై ఎలక్షన్ ను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని పార్టీల కంటే ముందే మండలాల వారీగా ఇంఛార్జిలను నియమించి.. వారిని రంగంలోకి దింపింది. ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ లకు అప్పగించారు గులాబీ పార్టీ బాస్, సీఎం కేసీఆర్. ఇటు కేసీఆర్ స్వయంగా ఎప్పటికప్పుడు హుజురాబాద్ లోని రాజకీయ పరిస్థితులపై ఆరా…
ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల… ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ప్రతీ వారం ఒక ప్రాంతంలో దీక్ష చేస్తున్న ఆమె.. ఈసారి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో దీక్షకు దిగనున్నారు.. ఈ నెల 24వ తేదీన మంగళవారం లింగాపూర్‌లో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష ఉంటుంది.. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్ ఇంటి…