బీజేపీని డిఫెన్స్ లో పెట్టేలా కేసీఆర్ ప్లాన్ వేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు చావోరావో అన్నట్లుగా మారింది. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే నడుస్తోందని భావించినా అనుహ్యంగా కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చింది. కాంగ్రెస్ కేవలం సెకండ్ ప్లేస్ కోసమే పోటీ పడుతుండగా టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం గెలిచి సత్తాచాటాలని ఉవ్విళ్లురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హూజురాబాద్ వేదికగా ఈ రెండు పార్టీలు పొలికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్ బీజేపీని ప్రస్తుతం ఢిఫెన్స్ లో పడేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హుజూరాబాద్లో ఈటల గెలుపు ఖాయమనే ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. హుజురాబాద్లో దళిత బంధు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, గొర్రెలు, పెన్షన్ల పంపిణీ వంటి చేపడుతున్నారు. అడిగిన వారికీ లేదనకుండా ఏదోఒక లబ్ధి చేకూరుస్తున్నారు. అయినప్పటికీ ఈటల వైపు గాలివీస్తుందని ఇంటలిజెన్స్ వర్గాలు సీఎం కేసీఆర్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా సాకుతో హూజురాబాద్లో ఎన్నిక వాయిదా పడేలా సీఎం కేసీఆర్ చేశారనే టాక్ విన్పిస్తోంది.
Also Read
- Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
- Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
మరోవైపు కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక సైతం మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతోంది. బీజేపీని దెబ్బతీసే వ్యూహంతో సీఎం కేసీఆర్ హస్తిన పయనమైనట్లు తెలుస్తోంది. పక్కా వ్యూహంతో సీఎం కేసీఆర్ బీజేపీని ముగ్గులోకి లాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏడాది కాలంగా ఢిల్లీ ముఖంచూడని కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాని మోదీని, కేంద్రమంత్రులను కలువడం వ్యూహాత్మకంగానే కన్పిస్తోంది. హుజురాబాద్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీపై వ్యతిరేకత తీసుకొచ్చేలా కేసీఆర్ ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకున్నారనే టాక్ విన్పిస్తోంది.
టీఆర్ఎస్ భవనం భూమిపూజ కోసమని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ అక్కడే ఐదురోజులు మకాం వేశారు. ప్రధాని మోడీతో సహా హోంమంత్రి అమిత్ షా ఇతర కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టారు. విభజన హామీలను అమలు చేయాలని, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక భవనానికి స్థలం కావాలని డిమాండ్ పెట్టారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలకు కేంద్రమే పరిష్కారం చూపాలని కోరారు. గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు హామీ ఇచ్చిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిని కూడా మరోసారి సీఎం కేసీఆర్ బీజేపీ పెద్దల వద్ద ప్రస్తావించడం ద్వారా ఆపార్టీని ఇరకాటంలోనే నెట్టినట్లు కన్పిస్తోంది.
కేంద్రాన్ని డిఫెన్స్ లో పెట్టేలా ఈ సమస్యలనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీ సమస్యలు తీర్చకపోతే హుజురాబాద్ ఎన్నికల్లో వాటిని ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక సందర్భంలో సీఎం కేసీఆర్ పదేపదే పీఎం అపాయిమ్మెంట్ అడిగితే ఇచ్చారని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా కేసీఆర్ కు కలిసొచ్చే అంశంగా మారనుంది. రాష్ట్ర ప్రయోజనాలకు కోసం బొంతపురుగునైనా కౌగిలించుకుంటానని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో తాను పదేపదే కేంద్రం పెద్దలను కలిసినా వారి నుంచి సహకారం లభించడం లేదని ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్నే కేసీఆర్ ప్రధాన అస్త్రంగా బీజేపీపై ప్రయోగించినా ఆశ్చర్యం లేకపోవచ్చనే వాదనలు విన్పిస్తున్నాయి.
ఈ పరిణమాలన్నీ కూడా బీజేపీకి మైసస్ గా మారనుండటం కేసీఆర్ కు అడ్వాంటేజ్ మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హుజురాబాద్లో గెలుపు కోసం తీవ్రం ప్రయత్నం చేస్తున్న బీజేపీ తనకు అందివచ్చిన అవకాశాన్ని చేజేతుల కాలరాసుకుంటున్నట్లు కన్పిస్తోందని అంటున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ బీజేపీ వైపు వీస్తున్న గాలిని తనవైపు తిప్పుకునేలా శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ముందు ఓ రేంజులో రెచ్చిపోయిన బీజేపీ ఇప్పుడు ఢిఫెన్స్ లోకి వెళ్లినట్లు కన్పిస్తోంది. దీంతో హుజూరాబాద్లో ఈటల గెలుపు ఖాయమనుకున్న పరిస్థితి నుంచి పోరాటం చేయాల్సిన పరిస్థితికి బీజేపీ చేతులారా తెచ్చుకుందనే అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
OTR: టీజీ భరత్ వర్సెస్ పోలీస్ శాఖ? మంత్రి సంచలన వ్యాఖ్యల వెనుక అసలేం ఉంది?
-
Gas Cylinder Racket : హైదరాబాద్‌లో అక్రమ గ్యాస్ దందా.. 750 సిలిండర్లు సీజ్.!
-
OTR: సామేల్‌కు చెక్ పెట్టడానికే సోమన్న ప్రస్తావన? కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యూహం ఇదేనా?
-
SSC జాబ్ కావాలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీ!
-
OTR: ఈ.. నటన ఏదైతే ఉందో…!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!