తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. కొత్త కార్యవర్గం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ టూర్‌కి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌లో లేదా మహబూబాబాద్‌లో రాహుల్ సభ ఉంటుందని టీ పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. సెప్టెంబర్ 17న సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చే సమయాన్ని బట్టి డేట్ మారే అవకాశం ఉందని తెలంగాణ పీసీసీ నేతలు చెప్తున్నారు. Read Also :…
కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు దీపావళి వరకు ఉచిత బియ్యం ఇస్తాం.. అవసరమైతే ఇంకా పొడిగిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రెండో రోజు సూర్యాపేట జిల్లాలో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాద్ర సాగుతోంది.. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపికైన మెరుగు మారతమ్మ నివాసంలో అల్పాహార విందు చేశారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ…
వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. వైఎస్ఆర్టీపీ పార్టీకి… ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. రాజీనామా పత్రాన్ని కూడా ఇందిరా శోభన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు వైఎస్ఆర్టీపీ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇందిరా శోభన్. ” షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నన్ను ఆదిరిస్తున్న తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ రుణపడి…
తెలంగాణ రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రుల ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఐటీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… హెల్త్ ప్రొఫైల్ రికార్డ్ ప్రాజెక్టు కోసం ములుగు, సిరిసిల్ల జిల్లా ల ఎంపిక చేశామన్నారు. ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని… ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే,…
ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కంచుకోట. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించిన కామ్రేడ్స్‌కు ఈ ప్రాంతం అడ్డా. ఇప్పుడా వైభవం లేదు. ఉనికి కాపాడుకోవడానికే లెఫ్ట్ పార్టీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కమ్యూనిస్ట్‌లు ఖిల్లాలో ఎందుకీ దుస్థితి? ఎర్ర జెండా అలిసిందా? వెలిసిందా? లెట్స్ వాచ్! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎర్రజెండా రెపరెపల్లేవ్! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కేరాఫ్ అడ్రస్. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్‌సభతోపాటు పలు అసెంబ్లీ…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 409 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 453 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,035 కు చేరగా.. రికవరీ కేసులు 6,43,318 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
తెలంగాణలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షల కారణంగా శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 45, 210 క్యూసెకులుగా ఉంది. శ్రీ రాంసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1090 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 90 టిఎంసీలు కాగా ప్రస్తుతం 85 టీఎంసీలు ఉంది. అయితే ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో…
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఫైర్ అయ్యాడు. బండి బండరాం బయటపెడుతా అని అన్నారు. బండి సంజయ్ మీద కరీంనగర్ నుండి మాకు వందలాది కాల్స్ వస్తున్నాయి… బండి సంజయ్ ని ఎంపీ పదవి నుండి దింపే వరకు ఉరుకోను. పూర్తి ఆధారాలతో బండి సంజయ్ పై మీడియా సమావేశం పెడుతా. నేను భయపడే వ్యక్తి ని కాదు…బయపడితే రాజకీయాల్లో ఉండలేను. దళితుల పై దాడి చెసా అంటున్నారూ నేను…
రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను త్వరలో ప్రారంభిస్తాం అని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రుల ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ హెల్త్ ప్రొఫైల్ రికార్డ్ ప్రాజెక్టు కోసం ములుగు, సిరిసిల్ల జిల్లాలను ఎంపిక చేసారు. ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే, వారికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో ఉపయుక్తంగా ఉంటుంది.…
దళిత బంధు కింద కేసీఆర్ ఇస్తామని చెప్తున్న 10 లక్షలు ఆయన సొంత డబ్బు కాదు అని చెప్పిన భట్టి విక్రమార్క ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఒక భాగం మాత్రమే అన్నారు. దీన్ని ఏదో ఒక్క నియోజక వర్గంలో పరిమితం చేయొద్దు. రాష్ట్రమంతా ఈ పథకాన్ని అమలు చేయాలి అని తెలిపారు భట్టి. కో ఆర్డినెటర్లు నియోజక వర్గాలలో ఈ విషయాలను బాగా విస్తృత ప్రచారం చేయాలి అని సూచించారు. నియోజక…