హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎవరి గెలిస్తే మేలు జరుగుతాదో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ పెద్ద నాయకుడు కావాలని తన స్వార్థం కోసం ఎన్నిక తీసుకొచ్చిండు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీజేపీకి ఓటు వేస్తే ఇప్పుడున్న గ్యాస్ ధర వెయ్యి నుండి పదిహేను వందలు అవుతాది. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి ధరలు పెంచుతున్నాది. సంక్షేమ పథకాలు ఇచ్చి పేద ప్రజలను ఆదుకున్న వారికి ఓటు వేస్తారా ధరలు పెంచిన వారికి ఓటు వేస్తార ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే పెంచిన గ్యాస్ డీజిల్ ధరలు సగానికి తగ్గించి ఓటు అడుగాలే అన్నారు.
ఇక రాష్ట్రం లో మిగితా మంత్రులు వారి నియోజక వర్గంలో డబుల్ బెడ్ రూం లు కడితే ఈటల రాజేందర్ ఒక్కటి కూడా కట్టలేదు. అధికారం లో ఉన్న టీఆరెఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే రాబోయే రోజుల్లో హుజూరాబాద్ ను ఇంకా అభివృద్ది చేస్తాం. గేల్లు శ్రీనివాస్ కు సైడ్ బిజినెస్ లు లేవు వ్యాపారాలు లేవు ఎప్పుడు హుజూరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటాడు అని పేర్కొన్నారు.